»   » ‘దండుపాళ్యం-2’ ముద్దు సీన్ మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవుతారు!

‘దండుపాళ్యం-2’ ముద్దు సీన్ మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడలో సూపర్ హిట్టయిన 'దండుపాళ్యం' చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇపుడు ఈచిత్రాని సీక్వెల్ గా 'దండుపాళ్యం-2' తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. దక్షిణాది సినిమాల్లో ఈ మధ్య హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్లు కామన్ అయ్యాయి. అయితే ఇద్దరు మహిళలతో లిప్ లాక్ సీన్లు మాత్రం చాలా అరుదు. ఇలాంటి షాకింగ్ సీన్ 'దండుపాళ్యం-2' సినిమాలో చూడబోతున్నాం.

బలవంతంగా ముద్దు

మేకింగ్ వీడియోలో... జైల్లో ఉన్న పూజాగాంధీ కి మరో ఖైదీ బలవంతంగా లిప్ లాక్ ముద్దు పెట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు. నాటుగా, ఘాటుగా ఉన్న ఈ సీన్ సినిమాపై కాస్త వివాదం రేపడంతో పాటు, అందరి చూపు ఇటు వైపు పడేలా చేసింది.

డైరెక్ట్ సీన్

డైరెక్ట్ సీన్

సాధారణంగా ఇలాంటి ముద్దు సీన్లు ఉంటే....అది నిజంగా లిప్ లాక్ సీనే అనేలా ప్రేక్షకుడు భ్రమపడేలా ట్రిక్స్ ప్లే చేస్తారు. వీటినే చీటింగ్ షాట్స్ అంటారు. కానీ దండుపాళ్యం 2 విషయంలో ఎలాంటి చీటింగ్ చేయకుండా డైరెక్టుగా సీన్ తీశారు.

దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రాన్ని జూలై 14న తెలుగు, కన్నడ భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రియల్‌ ఇన్సిడెంట్స్‌తో ఎంతో నేచురల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. దండుపాళ్యం చిత్రాన్ని మించి 'దండుపాళ్యం2' సూపర్‌హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌ మాకు వుంది'' అన్నారు.

సరికొత్త ఎక్స్ పీరియన్స్

సరికొత్త ఎక్స్ పీరియన్స్

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు.

నటీనటులు

నటీనటులు

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

English summary
Controversial lip kiss scene making in Dandupalya 2. Dandupalya 2 is a crime film, starring Pooja Gandhi and Raghu Mukherjee in the leading roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu