పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పి ఇంటరాగేషన్.. రామ్ గోపాల్ వర్మ సంచలనం.. రియల్లీ షాకింగ్!
కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, వాటిని చెల్లుబాటు చేసుకోవడం ఒక్క రామ్ గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యం. ఎలాంటి వివాదంలో అయినా వేలు పెట్టడం, పైగా తనను తాను సమర్దించుకుంటూ కామెంట్లు చేయడంలో దిట్ట ఈ సంచలన దర్శకుడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసిన ట్వీట్ జనాలకు ఊహించని షాకిచ్చింది. తన తాజా సినిమా 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు వర్మ. పూర్తి వివరాల్లోకి పోతే..

ఊహించని అప్‌డేట్స్.. రాజకీయ వర్గాలకు చుక్కలు
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ మరోసారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో దానికి కొనసాగింపు స్టార్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా ఈ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నాడు వర్మ.

చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్.. అదే బాటలో
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనేది రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు వర్మ. ఇప్పటికే వారి వారి లుక్స్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అదే కోవలో తాజాగా ఆయన వదిలిన ఓ పొలిటిషయన్ పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పించి మరీ..
బెజవాడకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు వంగవీటి రంగ తనయుడు, ఒకప్పటి వైసీపీ నేత వంగవీటి రాధ పాత్రను పరిచయం చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ పాత్ర పేరును సినిమాలో గంగవీటి భవాని అని పెట్టేశాడు. ఈ రోల్ కోసం ధన్ రాజ్‌ని ఎంచుకోవడ్ విశేషం. ఈ గంగవీటి భవానీని సిట్ పోలీస్ ఆఫీసర్ సుందరి పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పించి మరీ ఇంటరాగేషన్ చేస్తున్న పిక్ షేర్ చేసి షాకిచ్చాడు. ఆ సిట్ ఆఫీసర్ సుందరి ఎవరో కాదు న్యూస్ ప్రెజెంటర్, యాంకర్ స్వప్న. ఈ పోస్టర్‌ను వదులుతూ వర్మ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
సారీ సారీ అంటూ వరుస ట్వీట్స్
‘వంగవీటి రాధాను సిట్ ఆఫీసర్ సుందరి విచారిస్తున్నారు..సారీ సారీ, నా ఉద్దేశం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాలో గంగవీటి భవానిని'' అని మొదట ట్వీట్ చేసిన వర్మ.. ఆ వెంటనే ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లులో బెజవాడ రౌడీ వంగవీటి రాధ సన్ ఆఫ్ వంగవీటి రంగ.. సారీ సారీ నా ఉద్దేశం గంగవీటి భవాని సన్ ఆఫ్ గంగవీటి గంగ'' అంటూ వెటకారంగా మరో ట్వీట్ చేశాడు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు హంగామా
ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై పోలీస్ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











