తెలంగాణ సీఎంకు నయీం వార్నింగ్, భువనగిరి ఎమ్మెల్యేకు గ్యాంగ్‌స్టర్ ఎటాక్.. నయీం డైరీస్‌లో వివాదాస్పదస్పద సీన్లు

తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్, మాజీ నక్సలైట్ నయీం జీవితంలోని కొన్ని కీలక సన్నివేశాల ఆధారంగా తెరకెక్కిన నయీం డైరీస్ మూవీలోని కొన్ని సీన్లు వివాదాస్పదంగా ఉండటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమ పార్టీ అధినేతకు నయీం ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన సన్నివేశాలపై ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏమిటంటే..

నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా నయీం

నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా నయీం

తెలంగాణలోని భువనగిరి ప్రాంతంలో నక్సలైట్‌గా జీవితాన్ని ప్రారంభించిన నయీం అనేక సంచలనలాకు కేంద్ర బిందువు అయ్యారు. డీజీపీ వ్యాస్‌ను పట్టపగలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాల్చి చంపిన నయీం ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారారు. ఆ తర్వాత జైలులో జరిగిన కొన్ని పరిణామాల అనంతరం నయీం పోలీసు ఇన్ఫార్మర్‌గా, నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా సొంత కుంపటి పెట్టి వారి అంతానికి పూనుకొన్నారు.

తెలంగాణ ఉద్యమ సారథికి నయీం వార్నింగ్

తెలంగాణ ఉద్యమ సారథికి నయీం వార్నింగ్

అయితే నయీం డైరీస్ సినిమాలో నయీంను పెంచి పోషించిన ఓ పోలీస్ ఆఫీసర్‌తో చర్చ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి సారథిగా వ్యవహరించే సీవీఆర్ గురించి ప్రస్తావన వస్తుంది. అయితే సీవీఆర్ గురించి లైట్ తీసుకో. అతడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆయన నెంబర్ ఇవ్వు.. నేను నేరుగా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను అంటూ నయీం చెబుతాడు. పోలీస్ ఆఫీసర్ నుంచి నంబర్ తీసుకోని సీవీఆర్‌కు గట్టి వార్నింగ్ ఇస్తాడు.

జాతీయ పార్టీ అధినేత్రి గురించి

జాతీయ పార్టీ అధినేత్రి గురించి

అయితే తెలంగాణ ఉద్యమ సారథికి ఢిల్లీలో పెద్ద నెట్ వర్క్ ఉంది. ఆ పార్టీ అధినేత్రితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆమెతో ఎప్పుడూ టచ్‌లో ఉన్నాడు అని పోలీస్ ఆఫీసర్ అంటే.. సీవీఆర్‌కు అంత సీన్ లేదు. ఢిల్లీలో ఆయనను ఎవరూ పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ అవతరించదు. తెలంగాణలో నేనే హీరోను అంటూ నయీం పాత్రధారి తన అత్యుహాన్ని ప్రదర్శిస్తాడు.

ఉద్యమ నేత తెలంగాణ సీఎం కావడంపై నయీం

ఉద్యమ నేత తెలంగాణ సీఎం కావడంపై నయీం

అయితే తెలంగాణ రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత సీవీఆర్ సీఎం కావడాన్ని నయీం తట్టుకోలేకపోతాడు. తాను ఊహించిన దానికంటే భిన్నంగా రాజకీయాల్లో మార్పులు రావడాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. తన అంచనాలు ఇలా విఫలమయ్యాయేమిటనే ఆలోచనలో పడిపోతాడు. ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడం.. విదేశాల నుంచి వచ్చిన అతడిని అక్కడికే వెళ్లిపో అని ధమ్కీ ఇవ్వడం, ఎమ్మెల్యే తన ఆదేశాలను వినకపోతే.. నేరుగా అతడి ఇంటిలో విష సర్పాన్ని వదలడం లాంటి సీన్లు సెన్సేషనల్‌గా కనిపించాయి.

భువనగిరి ఎమ్మెల్యేకు వార్నింగ్, రాజీనామా

భువనగిరి ఎమ్మెల్యేకు వార్నింగ్, రాజీనామా

అయితే భువనగిరి ఎమ్మెల్యే నయీం దాడులకు, వార్నింగులకు భయపడి రాజీనామా చేయడం, నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెలంగాణ సీఎంకు మొరపెట్టుకోవడం లాంటి సన్నివేశాలు ఆసక్తిని రేపిస్తాయి. అయితే ప్రతీ దానికి ఓ సమయం ఉంటుంది. నయీం త్వరలో ఆటకట్టిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల రాజీనామాలను చింపి చెత్త బుట్టలో వేయడం లాంటి సీన్లు నయీం డైరీస్‌లో కనిపిస్తాయి. అయితే ఇలా టీఆర్ఎస్ అధినేతకు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం లాంటి సన్నివేశాలు వివాదాస్పదంగా మారే అవకాశాలు లేకపోలేదనే విషయం మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే టీఆర్ఎస్ వర్గాలు ఈ వివాదాలపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.

Recommended Video

Nayeem Diaries Team Reveals Shocking Facts About Movie | Part 03 || Filmibeat Telugu
నయీం డైరీస్‌లో దివి వద్యా కీలక పాత్ర

నయీం డైరీస్‌లో దివి వద్యా కీలక పాత్ర

కేజీఎఫ్, నారప్ప ఫేమ్ వశిష్ట సింహ, యజాశెట్టి, దివి వద్యా తదితరులు నటించిన నయీం డైరీస్ చిత్రం డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్నది. నయీం ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారారనే అంశాలను ప్రస్తావిస్తూ సినిమా రూపొందింది. అయితే నయీం జీవితంలో, అలాగే ఎన్‌కౌంటర్‌ సందర్భంగా జరిగిన తెర వెనుక విషయాలను డైరెక్టర్, మాజీ నక్సలైట్ దాము బాలాజీ ఆసక్తికరంగా చిత్రీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X