రక్త చరిత్ర దెబ్బకి బృందావనం సగం-ఖలేజా సమాప్తం...!
మరోసారి తెలుగు సినిమా అనువాదం దెబ్బకి విలవిల్లాడింది. రోబో కొట్టిన దెబ్బ ఇంకా మరవక ముందే మరో అనువాద చిత్రం 'రక్తచరిత్ర" వచ్చి తెలుగు బాక్సీఫీస్ ని షేకాడిస్తోంది. చిత్రంగా ఒరిజినల్ వెర్షన్ అయిన బాలీవుడ్ లో మిశ్రమ స్పందన రాబట్టుకుంటున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం మంచి వసూళ్లు తెచ్చుకుంటోంది. ఈ చిత్రానికి ఎంతగా క్రేజ్ ఏర్సడిందంటే అప్పటివరకు స్ట్రాంగ్ గా ఉన్న బృందావనం కి చాలా సెంటర్లలో వసూళ్లు సగానికి పడిపోయాయి. ఇక అప్పటి వరకు పడుతూ లేస్తూ ఉన్న మహేష్ 'ఖలేజా" రక్త చరిత్ర రాగానే దాని ఊసే లేకుండా పోయింది. అంతటితో ఖలేజా కథ సమాప్తం అని తేల్చేసి ప్లాప్ స్టాంప్ వేసేసింది.
కాగా స్వర్గీయ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన వివాదాస్పద సన్నివేశాలు 'రక్త చరిత్ర"కి అప్పటికే ఉన్న క్రేజ్ ని డబుల్ చేయడంతో అన్ని చోట్లా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజుతో మళ్లీ తెలుగులో డైరెక్టర్ గా దిగుతున్న రామ్ గోపాల్ వర్మకి ఇది నూతనోత్తేజం ఇస్తుంది.


Click it and Unblock the Notifications











