»   » బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక చీకటి సామ్రాజ్యపు పునాదులు కదిలాయి... గ్యాంగ్స్టర్ నయీం ని మట్టుపెట్టారు పోలీసులు. అయితే ఇది ఇక్కడితో ముగిసి పోలేదు. అసలు కథ ఇక్కడే మొదలయ్యింది. ఓక్ప్పుడు నయీం లాంటి ఒక మాఫియా కింగ్ తో స్వలాభం కోసం, కలిసి పని చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయో అన్న భయం తో తిరుగుతున్నారు... ఇలాంటి సందర్భం లో రాజ‌కీయ నేత‌లు, పోలీసుల వ‌ర‌కే న‌యీం కార్య‌క‌లాపాలు ప‌రిమితం అనుకున్న టైంలో దాదాపు 10 వేలకు పైగా సినిమాల‌లో న‌యీం దొడ్డిదారిలో పెట్టుబ‌డులు పెట్టిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

దీంతో టాలీవుడ్ గురించి ఒకింత అభిమానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ముక్కున వేలేసుకున్నారు. ఈక్ర‌మంలోనే టాలీవుడ్ నిర్మాత న‌ట్టి కుమార్ మీడియా ముందుకు వ‌చ్చి.. న‌యీంతో త‌న‌కున్న బాధ‌ల‌ను మొర‌పెట్టుకున్నాడు. అక్కడ మొదలయ్యింది అసలు కథ.... కొందరు నిర్మాతలకూ నయీం తో సంభందాలున్నాయని చెప్పటంతో... ఇక ఒకరిమీఎద ఒకరి ఆరోపణల పర్వం మొదలయ్యింది. ఒకరు బ్లూ ఫిల్స్ చేసాడూ అంటే... ఇంకొకరు.., అక్రమ వసూళ్ళూనీ, ఇంకొకరు హీరోయిన్లతో సెక్స్ సంబందాలూ అనీ. , ఆరోపణలు చేసుకుంటూ... టాలీవుడ్ వెనక ఉన్న చీకటి కోణాన్నీ బయట పెడుతున్నారు.... ఒక సారి మన తెలుగు నిర్మాతల ఆరోపణలు చూస్తే....

చాలామంది నిర్మాతలే

చాలామంది నిర్మాతలే

చాలామంది నిర్మాతలే నయీం తో మంచి సంభందాలను కలిగిఉన్నాయని చెప్తూ మ‌రో నిర్మాత సీ క‌ల్యాణ్ పేరును వెలుగులోకి తెచ్చాడు నట్టికుమార్. న‌యీంతో క‌ల్యాణ్‌కి సంబంధాలున్నాయ‌ని, న‌యీం సొమ్ముకు క‌ల్యాణ్ బినామీగా ఉండే వాడ‌ని చెప్పాడు.

న‌ట్టి వ్యాఖ్య‌ల

న‌ట్టి వ్యాఖ్య‌ల

న‌ట్టి వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన నిర్యాత‌ క‌ల్యాణ్‌.. న‌ట్టి గాలి తీసేశాడు. నీలి చిత్రాలు తీస్తూ, లీజుకు తీసుకున్న థియేటర్లను తనవని చెప్పుకుని బ్యాంకుల ఓడీ లావాదేవీలు నడిపించిన నట్టి కుమార్ కు తనను విమర్శించే స్థాయి లేదని ఓ రేంజ్‌లో ఫైర‌య్యాడు.

అంతేకాకుండా

అంతేకాకుండా

అంతేకాకుండా, తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను తీసి వారినే బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నట్టి కుమార్‌ద‌ని క‌ల్యాణ్ విరుచుకుప‌డ్డాడు. విశాఖపట్నం బ్యాంకుల్లో నట్టి జరిపిన కుంభకోణం త్వరలోనే బయటకు రానుందని ఈయ‌న మ‌రో బాంబు పేల్చాడు.

న‌యీం

న‌యీం

న‌యీంతో త‌న‌కు సంబంధాలున్నాయ‌న్న న‌ట్టి వ్యాఖ్య‌ల‌ను క‌ల్యాణ్ తోసిపుచ్చారు. ‘నోరు జారితే చెప్పు తెగుద్ది' అంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. క్రీస్తు పేరు చెప్పుకుని నట్టి కుమార్ డబ్బులు దండుకుంటున్నాడని ఆరోపించారు.

నట్టి కుమార్

నట్టి కుమార్

నట్టి కుమార్ చరిత్ర మొత్తం బ్లాక్ మెయిలింగేనన్నారు. న‌యీం బాధితుల మాదిరిగానే న‌ట్టి బాధితులు వేల‌ల్లో ఉన్నార‌ని, వారి కోసం కూడా ప్ర‌భుత్వం ఓ ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని వ్యాఖ్యానించారు క‌ల్యాణ్‌.

ఇక దీనికి కౌంటర్గా

ఇక దీనికి కౌంటర్గా

ఇక దీనికి కౌంటర్గా బ్లూఫిలింకేసులో జైలుకెళ్లిన చరిత్ర సి. కల్యాణ్ మరిచారా అని నిర్మాత నట్టికుమార్‌ ప్రశ్నించాడు.కల్యాణ్‌ పై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ ఆయన తేల్చిచెప్పాడు. బ్లూఫిలింకేసులో జైలుకెళ్లిన చరిత్ర మరిచారా?.

దొంగతనాలతోనే సి. కల్యాణ్‌

దొంగతనాలతోనే సి. కల్యాణ్‌

దొంగతనాలతోనే సి. కల్యాణ్‌ ఎదిగాడంటూ నట్టికుమార్ వ్యాఖ్యానించాడు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసిన కల్యాణ్‌ రూ. కోట్లు ఎలా సంపాదించాడు? ఆ వ్యవహారమంతా బయటపెట్టాలని ఆయన ఎద్దేవా చేశారు. ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్‌కు సంబంధాలున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

మీడియాలో

మీడియాలో

మీడియాలో నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. వ్యక్తిగతంగా సి. కళ్యాణ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసిరాడు. నానక్‌రాంగూడలో సి.కళ్యాణ్‌ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నాడు. నేను ఎక్కడా ఏసుప్రభువు పేరుతో డబ్బు వసూలు చేయలేదు.. ఏ విచారణకైనా నేను సిద్ధమని నట్టికుమార్‌ చెప్పాడు.

భార్యను చంపిన కేసు

భార్యను చంపిన కేసు

భార్యను చంపిన కేసు ఎవరి మీద ఉందన్నది అందరికి తెలుసు అలాంటివాడు నన్ను బెదిరిస్తున్నాడు..నా పైపై భౌతికదాడులకు దిగుతానని బెదిరిస్తున్నారు.. వాళ్ళకి ఈ వ్యాఖ్యలు చాలు ఎవరికి మందిమార్బలం ఉందో అర్థమవుతుంది అంటూ తీవ్రంగానే అన్నాడు నట్టి.

బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

ఒకరిమీద ఒకరి ఆరోపణల్లో మొత్తంగా కాకున్నా సగమైనా నిజాలు ఉండవచ్చు అనే అభిప్రాయం మాత్రం జనాల్లో బలంగానే ఉంది. అసలు సినిమా ప్రపంచం వెనక కనిపించని బ్లూఫిలిం లూ, హీరోయిన్లని లైంగికంగా వాడుకోవటాలూ, బ్లాక్ మనీ ని సినిమా పెట్టుబడులుగా..ఇంకా రకరకాలుగా వైట్ గా మార్చటాలూ ఇవన్నీ అర్థమౌతున్న జనం మాత్రం అవాక్కౌతున్నారు.

బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

బ్లూఫిలిం లూ..హీరోయిన్ లతో సెక్స్ సంబందాలూ.. హత్యలూ... మన నిర్మాతలు చీకటి నిజాలు చెప్పుకుంటున్నారా?

ఏదేమైనా న‌యీం విష‌యం ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. న‌యీంపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌పైనే నిఘాను పెంచింది! ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో మ‌రెన్ని నిజాలు వెలుగులోకి వ‌స్తాయో చూడాలి!

English summary
Following the death of gangster Nayeem, Tollywood links are coming up one by one. Producer Natti Kumar has hit out at another producer C Kalyan and others alleging their criminal activities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu