twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నావి బత్తాయి సైజే.. బూతులతో.. వైరల్ అవుతున్న ట్రైలర్, సినిమాపై రచ్చ తప్పదా?

    |

    తమిళంలో గత నెలలో విడుదలై పలు వివాదాలకు కారణమైన '90 ఎంఎల్' మూవీ త్వరలో తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, శృంగార సన్నివేశాలు శృతి మించి ఉండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే తమిళనాడులో రచ్చ జరిగింది.

    తెలుగు యువతను సినిమా వైపు ఆకర్షించడంలో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ ట్రైలర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా విడుదలైతే ఆందోళనలు మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల తెలుగులో విడుదలైన 24 కిస్సెస్, మరికొన్ని చిత్రాలపై విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

    బిగ్ బాస్ బ్యూటీ ఓవియా

    బిగ్ బాస్ బ్యూటీ ఓవియా

    ఈ చిత్రంలో తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఓవియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ట్రైలర్లో ఆమెపై చిత్రీకరించిన శృంగార సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సీన్లలో వల్గారిటీ శృతి మించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    మద్యం, సెక్స్, సిగరెట్లు

    మద్యం, సెక్స్, సిగరెట్లు

    ట్రైలర్లో అమ్మాయిల గ్యాంగ్ మద్యం సేవిస్తూ, సిగరెట్లు తిగుతూ... విచ్చలవిడిగా సెక్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించారు. ఈ సీన్ల వెనక ఎలాంటి స్టోరీ ఉందో తెలియదు కానీ... సమాజంలోకి ఒక చెడు సందేశం ఇచ్చే విధంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.

    నీకేం నీవి గంగ బోండాలు, నావి చిన్న బత్తాయిలే

    నీకేం నీవి గంగ బోండాలు, నావి చిన్న బత్తాయిలే

    అయితే ట్రైలర్లో కొన్ని డైలాగులు డబుల్ మీనింగుతో పరాకాష్ఠకు చేరాయి. గర్ల్ గ్యాంగ్ మధ్య వచ్చే డిస్క్రషన్లో ఓ సీన్లో ‘‘నీకేం నీవి గంగ బోండాలు..నావి చిన్న బత్తాయిలే'' అంటూ ఓ అమ్మాయి అనగా.. మరో అమ్మాయి... ‘‘నువ్వే అలా అంటే ఎలా? ఆ దేవుడు నాకు నిమ్మకాయలే పెట్టాడు'' అంటూ చెప్పడం ట్రైలర్లో మరింత హీటు పెంచాయి.

    తమిళనాడులో కేసులు

    తమిళనాడులో కేసులు

    '90 ఎంఎల్' చిత్ర దర్శకురాలైన అనితా ఉదీప్, నటి ఓవియాలపై ఇప్పటికే తమిళనాడులో పలు కేసులు నమోదయ్యాయి. మద్యం తాగడం, లిప్‌లాక్ సన్నివేశాలు, సహజీవనం వంటి సన్నివేశాలు సంస్కృతి సంప్రదాయాలు మంటగలిపేలా ఉన్నాయని కొందరు ఫిర్యాదు చేశారు.

    తెలుగు ట్రైలర్

    ‘90 ఎంఎల్' చిత్రాన్ని అనితా ఉదీప్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రానికి తమిళ స్టార్ శింబు మ్యూజిక్ అందించడం విశేషం. బిగ్ బాస్ బ్యూటీ ఓవియాతో పాటు అన్సన్ పాల్, మాసుమ్ శంకర్, మోనిషా రామ్, శ్రీగోపికా, బొమ్ము లక్ష్మి, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు. శింబు ఓ చిన్న అతిథి పాత్రలో నటించారు.

    English summary
    Controversies around 90ML Telugu Trailer. 90ml is a 2019 Indian Tamil-language comedy drama film written and directed by Anita Udeep. The film stars Oviya, in lead role. The film is produced by Udeep under Nviz Entertainment. This film releasing Telugu soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X