వర్మపై కాపీ దుమారం

By Staff

Rann
రామ్ గోపాల్ వర్మ అట్టహాసంగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్న 'రణ్' సినిమా అప్పుడే వివాదాలలో చిక్కుకుంటోంది. ఆ సినిమా కథ తనదేనంటూ...ఎంతటి పోరు కైనా తాను సిద్దంగా ఉన్నానంటూ ఔత్సాహిక రచయిత,ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ అయిన సోనాల్ మెహతా ఇటీవలే ప్రకటించింది.ఈ కథను తాను వర్మకు చెప్పానని ఆయన ఈ సినిమా గురించి ప్రకటించగానే తాను ఆసగా తన పేరు కోసం చూసానని అయితే అది కనపడలేదని చెప్పుకొచ్చింది. సర్లే అని వర్మ కార్పోరేషన్ ని సంప్రదిస్తే..సమాధానం చెప్పేవారే కరువయ్యారంటూ...వాపోయింది.

ఇంతకి సోనాల్ కీ వర్మ కి ఎక్కడ పరిచయం అంటే ఆమె చాలా కాలం వర్మ పాక్టరీలో రైటర్ పోస్ట్ లో ఎంప్లాయి గా చేసింది. అక్కడుండగా వర్మ ఐడియాలతో అనేక స్క్రిప్టులకు ఘోస్ట్ రైటర్ గా చేసింది. ఇక మీడియా పై సినిమా చెయ్యాలన్న ఐడియా వర్మ ది. అయితే..దాన్ని స్టోరి రూపంగా మార్చి ఆయనకు చెప్పిన ఘనత ఆమెది. అప్పుడు ఇంప్రెస్ అయిన వర్మ ఆమెకు కొంత టైమ్ డెడ్ లైన్ పెట్టి కథ,కథనాలు పూర్తి చెయ్యమన్నాడని తెలుస్తోంది.

అయితే ఆ తర్వాత ఆమె డవలప్ చేసి చెప్పిన కథ వర్మకు నచ్చకపోవటంతో ఆమెను ఈ ప్రాజెక్టునుండి తొలిగించారు. దాన్ని వేరే రచయిత అయిన Rohit Banawlikar కి అప్పచెప్పారు. అప్పుడు అతను దాన్ని పూర్తి చేసి,రైటర్స్ అశోషియేషన్ లో రిజిస్టర్ చేసారు. ఇదే విషయాన్ని వర్మ దృవీకరిస్తున్నారు. అయితే సోనాల్ మాత్రం వదిలేటట్లు లేదు. కోర్టు కెళ్ళి తెచ్చుకుంటానంటోంది. నిజానికి మొత్తం కథ,పాత్రలూ ఆమెవే అయినా ఆమె పేర రిజిస్ట్రేషన్ లేకపోవటం ఆమెను నిరాశ పరిచే అంశం. ఏదైమైన రణ్ సినిమాకి కాప్షన్ గా వర్మ పెట్టిన టాగ్ లైన్ Truth is Terrible పైనే ఆమె నమ్మకం పెట్టుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X