ఉద్యోగల పేరుతో మోసం... తెలుగు డైరక్టర్ అరెస్టు
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. రోజూ వీటి గురించి ఎక్కడో చోట వార్త వస్తున్నా చదువుకున్న వారు సైతం మోసపోతున్నారు. తాజాగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు కుచ్చుపోటి పెట్టిన సంఘటన వైజాగ్ లో చోటు చేసుకుంది. ఆ ముఠాను టాస్క్ పోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళితే..
గతంలో కూల్ బాయ్స్...హాట్ గాళ్స్ టైటిల్ తో చిత్రం రూపొందించిన దర్శకుడు...ఉద్యోగాలు పేరుతో 17 లక్షలకు మోరకు మోసం చేసారు. వీరితో పాటు అసెస్టెంట్ డైరక్టర్, నిర్మాత,, జూనియర్ ఆర్టిస్టులు కూడా భాగస్వామ్యం ఉండటంతో వారిని అరెస్టు చేసారు.

నూతన తారలతో ఇంద్రగంటి క్రియేటివ్ మూవీస్ పతాకంపై దేవుడు దర్శకత్వంలో ఐ.ఎన్.రాజు నిర్మించిన చిత్రం 'కూల్ బాయ్స్ హాట్ గాళ్స్. ప్రవీణ్, సుప్రభవిష్యన్, వెంకీ, పరమేష్, త్రిశూల్, శుభశ్రీ, సింధుశ్రీ, ఝాన్సీ, గౌతంరాజు, తా.రమేష్, వేణు, ధన్‌రాజ్, ఉష, సమీర, శైలజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సదాచంద్ర, కెమెరా: హేరీబాబు, సంగీతం: నందన్‌రాజు, డాన్స్: రామారావు, ఆనంద్, ఎడిటింగ్: విజయ్, నిర్మాత: ఐ.ఎన్.రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవుడు.


Click it and Unblock the Notifications











