సుశాంత్ కాళ్లు విరిగిపోయి.. మెడ చుట్టూ గాయాలు.. వాళ్లు కూడా హత్యే అని.. ప్రత్యక్ష సాక్షి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అనేక ట్విస్టులతో ఎన్నో మలుపులు తిరుగుతున్నది. సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మీడియాలో కొనసాగుతున్న ట్రయల్స్‌తో అనేక విషయాలు వెలుగు చేస్తున్నాయి. 'సుశాంత్ మరణం తర్వాత ఆయన కాళ్లు విరిగాయి', 'మెడ చుట్టు గాయాలు ఉన్నాయి' అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి బలం చేకూర్చేలా కూపర్ హాస్పిటల్‌లో పనిచేసే సిబ్బంది సంచలన విషయాలను రిపబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. పేరు వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తి చెప్పిన ప్రకారం..

Recommended Video

Sushant Singh Rajput: సుశాంత్ గొంతు చుట్టూ సెల్లో టేప్, సూది పోట్లు..హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి!
 ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ డాక్టర్లు

ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ డాక్టర్లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చిన సమయంలో స్వయంగా ఆయన బాడీని నేను అంబులెన్స్ నుంచి దించాను. ఆ సమయంలో సుశాంత్ దేహాన్ని చూసి డాక్టర్లు తమలో తాము ఇది ఆత్మహత్య కాదు.. హత్య అనుకోవడం నా దృష్టికి వచ్చింది. మృతదేహాన్ని చూడగానే వారు తమలో తాము గుసగుసలాడుకోవడం నేను స్పష్టంగా చూశాను అని ఆ వ్యక్తి చెప్పారు.

ఎవరైనా ఉరి వేసుకొంటే.. అలా

ఎవరైనా ఉరి వేసుకొంటే.. అలా

ఏ వ్యక్తి అయినా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంటే నాలుక బయటకు వస్తుంది. మలమూత్రాలు బయటకు వస్తాయి. కానీ అలాంటి విషయాలు సుశాంత్ ముఖంలో గానీ, దేహంలో గానీ కనిపించలేదు. సుశాంత్ దేహం పొడిగా ఎలాంటి వాసన లేకుండా శుభ్రంగా, పొడిగా ఉన్నాయి. నాకు ఈ విషయంలో అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలనే ఈ ధైర్యం చేస్తున్నాను అని ఆ వ్యక్తి మీడియాకు చెప్పారు.

సుశాంత్ కాళ్లు విరిగి.. మెడకు గాయాలు

సుశాంత్ కాళ్లు విరిగి.. మెడకు గాయాలు

కూపర్ హాస్పిటల్‌లో సుశాంత్ దేహాన్ని చూసినప్పుడు ఆయన రెండు కాళ్లు విరిగి ఉన్నాయి. ఒక కాలు సన్నగా, మరో కాలు లావుగా ఉంది. నాకు తెలిసి అంతకు ముందు సుశాంత్‌కు అంగవైకల్యం లేదనుకొంటాను. ఆయన కాళ్లు విరిగి, మెడకు సూది పోట్లు కనిపించారు. ఆయన మరణంలో నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అని చెప్పారు.

రియా చక్రవర్తి 25 నిమిషాల పాటు

రియా చక్రవర్తి 25 నిమిషాల పాటు

మార్చురీలో ఉన్న సుశాంత్ మృతదేహాన్ని చూడటానికి రియా చక్రవర్తితోపాటు మరో ఇద్దరు వచ్చారు. దాదాపు 25 నిమిషాలు ఉన్నారు. ఆమెతోపాటు నేను లోపలికి వెళ్లాను. సుశాంత్ మృతదేహాన్ని చూడగానే సారీ బాబు.. క్షమించండి అని అన్నారు. ఆయనను చూసి ఏడుపు ఆపుకోలేకపోయింది. గుక్కపట్టి కాసేపు ఏడ్చింది అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

నా పేరు ఎందుకు బయటపెట్టవద్దొంటే..

నా పేరు ఎందుకు బయటపెట్టవద్దొంటే..

సుశాంత్ మృత దేహం గురించిన వివరాలు పోలీసులకు చెప్పడానికి భయపడుతున్నాను. ఎందుకంటే నాకు ఓ ఫ్యామిలీ ఉంది. నాకేమైనా అయితే వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. అందుకే నా పేరు బయట పెట్టవద్దని వేడుకొంటున్నాను. అయితే సుశాంత్ విషయంలో జరుగుతున్న గందరగోళం చూసి నిజాలు చెప్పాలని ముందుకు వచ్చాను అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X