»   »  హాట్ టాపిక్ : 'బాహుబలి' కి పోలీసుల సాయం

హాట్ టాపిక్ : 'బాహుబలి' కి పోలీసుల సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో గుర్రాల స్వారికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నేపధ్యంలో రాజమౌళి పోలీసుల సాయిం తీసుకోనున్నారని సమచారం. ఈ మేరకు ఆంగ్ల దినపత్రికలలో కథనాలు వెలువడుతున్నాయి.

దగ్గుపాటి రానా ... గుర్రపు స్వారీ చేస్తూ పడి దెబ్బలు తగుల్చుకోవటంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. ప్రొఫెషినల్ హార్స్ రైడర్స్ అయితే మంచిదనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్ డిపార్టమెంట్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇప్పటివరకూ ఈ విషయమై పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ... మరింత ఖచ్చితమైన అవుట్ పుట్ కోసం ప్రొఫెషనల్ అవసరం ఉందనే విషయం రాజమౌళి గ్రహించారని, సినిమాని ఓ రేంజికి తీసుకు వెళ్లాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని, పోలీసులు లభ్యం కాకపోతే మరింత ప్రొఫెషనల్స్ ని వెతుకుతారని సిని వర్గాల భోగట్టా.

'బాహుబలి' గురించి మరిన్ని విశేషాలు స్లైడ్ షో లో..

బడ్జెట్ ఎక్కువే

బడ్జెట్ ఎక్కువే

ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేది ప్రాజెక్టు ప్రారంభమైనప్పటినుంచి చర్చలో ఉన్న విషయమే. ఈ నేఫద్యంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రూ. 125 కోట్లతో రూపొందుతోందని పేరుపొదిన బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌కు చెందిన బాలీవుడ్ హంగామా డాట్ కామ్ రిపోర్ట్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మూడు భాషల్లో..

మూడు భాషల్లో..

ఇప్పటివరకూ రూపొందిన భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధిక వ్యయభరిత చిత్రంగా 'బాహుబలి'ని అభివర్ణిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక్క తెలుగు వెర్షన్‌కు మాత్రమే సంబంధించిన బడ్జెట్ కాదు. ఈ సినిమా మూడు భాషల్లో - తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో - ఏక కాలంలో నిర్మాణమవుతోంది.

పీరియడ్ లుక్

పీరియడ్ లుక్

ఎనిమిదో శతాబ్దం నాటి రాచరిక వ్యవస్థ నేపథ్యంలో రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం సాంకేతికంగా భారతీయ సినిమాని మరో స్థాయికి తీసుకుపోతుందనీ, ఇప్పటివరకూ చూడని అద్భుతమైన సెట్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయనీ సమాచారం. అనుష్క హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రానా నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.

దర్శకుడు ఖండన

దర్శకుడు ఖండన

'బాహుబలి'ని ఐమాక్స్‌ కెమెరాతో చిత్రించబోతున్నారనే విషయాన్ని దర్శకుడు ఖండించారు. ఈ సినిమాను ఆరీ అలెక్సా ఎక్స్‌టీ అనే కెమెరాతో తెరకెక్కిస్తామని తెలిపారు. అలాగే చిత్రీకరణకు అయ్యే వ్యయం గురించి వస్తున్న వార్తల్నీ తోసిపుచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో 'బాహుబలి' రూపొందుతుంది.

ఉద్వేగ భరితంగా...

ఉద్వేగ భరితంగా...

నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "దాదాపు ఏడాది పాటు చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత జూలై 6న 'బాహుబలి' షూటింగ్ మొదలు పెట్టాం..ఎంతో ఉద్వేగంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి అన్ని విధాలా సమాయత్తమయ్యారు'' అని తెలిపారు.

టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్


ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
With actors like Prabhas and Rana injuring themselves in horse riding accidents while training for 'Baahubali', director Rajamouli has reportedly decided to hire police personnel who are proficient in riding horses for this period saga. A source close to the unit says that hiring experienced riders is being planned for the big-budget flick. “The actors are taking extensive training for the horse-riding sequences and yes, even though nothing has been confirmed yet, the makers are looking at hiring professionals.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu