»   » ఝలక్ : ఎన్టీఆర్ మూవీ ప్రభావం ‘ఎవడు’పై!

ఝలక్ : ఎన్టీఆర్ మూవీ ప్రభావం ‘ఎవడు’పై!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం ఆడియో ఫంక్షన్ తొలుత జూన్ 30వ తేదీన ఆదివారం రోజు శిల్పకళా వేదికలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆడియో వేదికతో పాటు తేదీ కూడా మారింది. జులై 1న 'హెఐసిసి- నోవాటెల్' వద్ద ఆడియో వేడుక జరుపాలని నిర్ణయించారు.

'ఎవడు' ఆడియో వేదిక, తేదీ మార్పు వెనక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వక పోవడమే ఇందుకు కారణమట. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో వేడుక సందర్భంగా ఓ అభిమాని తొక్కిసలాటలో మృతి చెందిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే అనుమతి నిరాకరించారని సమాచారం.

అయితే 'హెఐసిసి- నోవాటెల్'లో పార్కింగ్ ప్లేస్ ఎక్కువగా ఉండటం, పెద్ద హాలు ఉండటంతో చివరకు అక్కడ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. వేదిక మారిన నేపథ్యంలో ఏర్పాట్లకు సమయం పట్టనున్న కారణంగా ఒక రోజు ఆలస్యంగా..అంటే జులై 1న 'ఎవడు' ఆడియో వేడుక నిర్వహించనున్నారు.

Yevadu

ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ రైట్స్ ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Cyberabad police on Friday refused to grant permission for the audio release function of Ram Charan Teja starrer 'Yevadu', at Shilpakalavedika on Sunday. The audio function was schedule to be held on June 30, Police rejected their request and hence program is moved to July 1st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu