మెగాస్టార్ రీ ఎంట్రీలో కథల వివాదాలు.. 'ఆచార్య' బాలయ్య కోసం రాసుకున్నారట!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం అభిమానులు అప్పట్లో ఎంతగా ఎదురుచూసారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆయన మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తరువాత బ్యాడ్ లక్ ఏమిటో గాని సినిమా కథలపై ఊహించని వివధాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆచార్య సినిమాపై ఒకేసారి ఇద్దరు కాపీ ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరైతే ఈ సినిమాను ముందుగా బాలయ్య కోసం అనుకున్నట్లు కామెంట్ చేశారు.

 రీ ఎంట్రీ తరువాత

రీ ఎంట్రీ తరువాత

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ లేకుండా సేఫ్ జోన్ లోనే సినిమాలు ఎంచుకుంటున్నారు. అయితే రీ ఎంట్రీ తరువాత ఆయన కథల ఎంపిక విషయంలో కొన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో నరసింహా అనే ఒక అప్ కమింగ్ దర్శకుడు కథ నాదేనంటూ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

సైరా విషయంలో..

సైరా విషయంలో..


దర్శకుడు మురుగదాస్ మోసం చేసి తమిళ్ లో తన కథను కాపీ కొట్టడాని కామెంట్ చేశారు. ఇక సైరా నరసింహా రెడ్డి బయోపిక్ కి వచ్చేసరికి సినిమా విషయంలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం చేశారు. తమ అనుమతి ఏ మాత్రం తీసుకోలేదని, ఆర్థిక సహాయం చేస్తారని కూడా అన్నారని మెగాస్టార్ ఇంటిముందే ధర్నాకు దిగారు.

ఆచార్యపై ఆరోపణలు

ఆచార్యపై ఆరోపణలు

ఇక ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కొత్త తరహా వివాదం చోటు చేసుకుంటోంది. కన్నెగంటి అనిల్ అనే రైటర్ ఆచార్య కథపై అనుమానాలు ఉన్నాయని ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వెంటనే స్పందించారు. 2006లోనే పుణ్యభూమి అనే కథను తాను రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్ట్రేషన్ చేయించానని అయితే ఇప్పుడు ఆచర్యకు దానికి దగ్గరకి సంబంధాలు ఉండవచ్చని డౌట్ వస్తోందని ఆరోపిస్తున్నారు.

Recommended Video

Megastar Chiranjeevi To Meet CM Jagan To Discuss Tollywood Problems
బాలకృష్ణ కోసం ఆచార్య

బాలకృష్ణ కోసం ఆచార్య

ఇక మరో అప్ కమింగ్ దర్శకుడు రాజేష్ మండూరి ఆచార్య కథ పూర్తిగా నాదేనని మీడియా ముందుకు వచ్చాడు. మొదట ఈ కథను నేను బాలకృష్ణ కోసం రాసుకున్నాను. నేను బి.గోపాల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. కొన్నాళ్ల క్రితం బాలయ్యకు కథను వినిపించి నిర్మాత కోసం వెతికే క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ కి కథను వినిపించాను. కానీ వాళ్ళు కొత్త డైరెక్టర్ పై అంత బడ్జెట్ పెట్టలేమని అన్నారు. అనంతరం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కథ అటు ఇటు తిరిగి కొరటాల వద్దకి వెళ్లిందని రాజేష్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X