twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ వివాదంలో...బ్రహ్మలోకం టు యమలోకం

    By Srikanya
    |

    'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే టైటిల్ తో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో శివాజీ హీరోగా ఓ చిత్రం క్రిందటి వారం రిలీజు అయింది. ఆ చిత్రం ఇప్పుడు కాపీ కాంట్రావర్శీని ఎదుర్కొంటోంది. ముచ్చర్ల రజనీ శకుంతల అనే నవలా రచయిత్రి తన నవల 'నరుడా ఏమి నీ కోరక' అనే ఆధారంగా దీన్ని తెరకెక్కించారంటూ టీవీ ఛానెల్స్ కి ఎక్కారు. తను రాసిన కథకూ,ఆ చిత్ర కధకూ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, నిర్మాతల దగ్గరకు వెళ్ళితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమన్నారని ఆమె పేర్కొంది. దాంతో తాను న్యాయం కోసం కోర్టుకు వెళతానంటున్నారు. దీనికి సంభందించిన చర్చ టీవీ9లో జరిగింది.

    ఇక బ్రహ్మలోకం టు యమలోకం చిత్రం దర్శకుడు కథకుడూ ఒకరే. ఆయనే గోళ్ళపాటి నాగేశ్వరరావు. ఆయన ఇంతకు ముందు కథ ఇచ్చిన అఆఇఈ (శ్రీకాంత్, మీరా జాస్మిన్) చిత్రం కూడా కాపీ వివాదాన్ని ఎదుర్కొంది. ఆ కథ తమ దగ్గర నుంచి కాపీ కొట్టారంటూ రైటర్స్ అశోశియేషన్ లో అప్పుడు కంప్లైంట్ నమోదు అయింది. ఇక ఇప్పుడీ వివాదం వచ్చింది. ఇక ముచ్చర్ల రజనీ శకుంతల...నరుడా ఏమి నీ కోరక..ఓ వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఈ కథలో హీరో వెంటబడే యముడూ, ఆ హీరో భుజం తట్టే బ్రహ్మదేముడు-వీరిద్దరి మధ్యా ఏరా చందూ అంటూ తిరిగే హీరోయిన్ లు ఉంటారు. ఇక కాపీ కాంట్రావర్సి ఎక్కడ దాకా వెళ్ళి ఆగనుందో చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X