జూనియర్ నన్ను కాపీ కొట్టాడంటున్న యువహీరో
జూనియర్ ఎన్టీఆర్ తనను కాపీ కొట్టాడని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నాడట...మరో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. రామ్ ఇటీవల 'కందిరీగ" సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించిన ఆనందంలో ఉన్నాడు. జూనియర్ గురించి రామ్ ఇలా అనడానికి కారణం...తన కందిరీగ సినిమాలోని కొన్ని డైలాగులు అచ్చు గుద్దినట్లు 'ఊసరవెళ్లి" సినిమాలో ఉండటమేనట. కందిరీగ సినిమాలో కరెంట్ వైర్ ను ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది లాంటి డైలాగులు ఉన్న విషయం తెలిసిందే. ఊసరవెళ్లి డైలాగ్ రైటర్ కొరటాల శివ కూడా దాదాపు అన్నీ ఇలాంటి డైలాగులే రాశాడట. మరి ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే....కందరీగ డైలాగ్ రైటర్ రాజేంద్రకుమార్, కొరటాల శివ మంచి ఫ్రెండ్స్, ఇద్దరి ఆలోచనలు పరస్పరం షేర్ చేసుకోవడంతో పాటు ఒకరికొరు సాయం చేసుకుంటారు...అందుకే వీళ్ల ఇద్దరూ రాసే డైలాగులు ఒకేలా ఉంటాయని ఫిల్మ్ నగర్ టాక్.
జూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా నటించిన ఊసరవెళ్లి చిత్రం ఇటీవల ఆడియో వేడుక జరుపుకుంది. ఈ సినిమాకు 'కిక్"లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, ప్రఖ్యాత కెమెరా మెన్ రసూల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, శ్యామ్, పాయల్ ఘోస్, రెహ్మాన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











