సుకుమార్ ..ఇదేం కాపీ క్రియేటివిటీ? (ఫస్ట్ లుక్ ఫొటోలు)
హైదరాబాద్: ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'కుమారి 21ఎఫ్'. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ సమర్పిస్తుండగా.. నూతన దర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేసారు. దాన్ని సుకుమార్ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసారు. దాన్ని ఇక్కడ చూడండి.
ఇక ఈ ఫస్ట్ లుక్ అప్పుడే కాపీ అనేవిషయం బయిటకు వచ్చింది. ఇది ఓ ఫ్రెంచ్ సింగర్ మ్యూజిక్ ఆల్బమ్ కవర్ పేజీ ది కావటం విశేషం. దాన్ని ఇక్కడ చూడండి.

ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ దర్శకుడు సూర్యప్రతాప్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకో ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ఇక్కడ చూడండి...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్'. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆయనే అందిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టాకీ పార్టు షూటింగ్ పూర్తి చేసుకుంది.
సుకుమార్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది అని తెలిపారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄఎష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.


Click it and Unblock the Notifications











