తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లంతా కాపీ కింగులేనా?
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లంతా కాపీ కింగులేనా? టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు చాలా మంది ఇదే బాపతా? అంటే అవును అనే అంటున్నారంతా. ఆయా సినిమాల్లోని మన మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేసిన ట్యూన్ అన్ని ఇంగ్లిష్, స్పానిష్, లాటిన్ భాషల్లో ఇదివరకే రూపొందిన ఫేమస్ ఆల్బమ్స్ కి మక్కికి మక్కి కాపీ కావడే ఇందుకు నిదర్శనం. ఇటీవల రాణా-ఇలియాన జంటగా విడుదలైన 'నేను నా రాక్షసి' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'పడితినమ్మో' సాంగు మైఖేల్ జాక్స్ లీవ్ మి అలోన్ కి కాపీ. ఈ చిత్రానికి సంగీతం అందించింది అనూప్ రూబెన్స్.
మహేష్ బాబు హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పోకిరి' సినిమాలో 'దేవ దేవ దేవ దేవుడా' సాంగు పాస్ సింగర్ రికీ మార్టిన్ ఆల్బమ్‌లోని 'జూలియోకి' మక్కికి మక్కి. అదే విధంగా మహేష్ నటించిన అతడు సినిమాలోని టైటిల్ సాంగు ఓ అమెరికా సాంగుకి కాపీ. దీంతో పాటు మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'హరే రామ హరే రామ' సాంగు ప్రేమ్ జాషువా ప్రైవేట్ ఆల్బమ్ బోలో హరి నుంచి కాపీ కొట్టారు. ఈమూడు పాటలకు ట్యూన్స్ సమకూర్చింది మణి శర్మే కావడం గమనార్హం.
ఇక గోపీ చంద్ హీరోగా వచ్చిన గోలీమార్ చిత్రంలోని 'నిదొరొస్తాలె' ఓ స్పానిష్ పాటకు సేమ్ టు సేమ్ కాపీ. ఈ చిత్రానికి సంగీతం అందించింది చక్రి. చార్మి ఒయ్యారాలు పోయిన 'మహ మహ' సాంగు లిక్స్ తో పాటు, డాన్స్ కూడా ఓ అమెరికా సాంగుకు ట్రూ కాపీనే. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగులో చాలా మంది కాపీరాయుళ్లే ఉన్నారు.


Click it and Unblock the Notifications











