twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైద్యులపై దాడి.. పత్తా లేకుండాపోయారు.. పౌర సంఘాలపై లిరిసిస్ట్, డైరెక్టర్ సెటైర్స్

    |

    కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే.. మానవాళిన రక్షించేందుకు వైద్యులు తమ ప్రాణాలనుపనంగా పెడుతున్నారు. భయంకరమైన వైరస్‌తో పోరాడేందుకు, ప్రజలను రక్షించేందుకు వైద్య బృందం అహర్నిశలు కష్టపడుతోంది. అయితే అలాంటి డాక్టర్లపై కొందరు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. వైద్యులపై దాడి ఘటనను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు.

     కరోనా బీభత్సం..

    కరోనా బీభత్సం..

    ప్రపంచవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ కరోనా దావానంలా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడ్డవారి సంఖ్య రెండు వేలకు దగ్గర్లో ఉంది. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్యల పెరుగుతూనే వస్తోంది.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో..

    రెండు తెలుగు రాష్ట్రాలు నువ్వా నేనా అన్నంత పోటి పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే డబుల్ సెంచరీ కొట్టేట్టు కనిపిస్తున్నాయి. ఏపీలో పరిస్థితిని చూస్తుంటే చేయి జారినట్టే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణలో వైద్యలపై దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఖండించిన సమాజం..

    ఖండించిన సమాజం..

    ఇలాంటి విపత్కర సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యం అందిస్తున్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని పౌర సమాజం మొత్తం ఖండించింది. అయితే చీటికిమాటికీ రచ్చ చేసే పౌర సంఘాలు మాత్రం ఈ విషయంలో మౌనం వహించాయి. తాజాగా పౌరసంఘాలను ఉద్దేశిస్తూ.. హరీష్ శంకర్, చంద్రబోస్ సెటైర్లు వేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి, నిజామాబాద్‌లో వైద్యబృందంపై దాడి ఘటనను ఖండిస్తూ.. చంద్రబాస్ స్పందించాడు. ‘పౌరహక్కుల సంఘాలు , మానవ హక్కుల సంఘాలు, మేధావులు, లౌకికవాదులు, హేతువాదులు ... ఎవరూ నిన్న డాక్టర్లపై జరిగిన దాడి గురించి ఒక్క మాట మాట్లాడరేం..నోళ్ళు ఏమౌపోయాయ్' అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    పత్తా లేకుండా పోయారు..

    పత్తా లేకుండా పోయారు..

    కరోనా లాంటి కష్టకాలంలో వైద్యులపై దాడి చేయడం లాంటి ఘటనపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. ‘డాక్టర్లు, నర్సులు..... పోలీస్ లు పౌరులు, మానవులు కాదా..!!? నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు...!! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం తోసుకుంటూ ముందుకొస్తారు' అంటూ మండిపడ్డాడు.

    English summary
    Corona Effect Harish Shankar Condemn Attack On Gandhi Doctors. Gandhi Hospital Doctors Are TattckedBy Patients. This Incident Was Condemned By Harish SHankar ANd Chandrabose.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X