twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేని కోసం ఈ పరుగు.. ఇలా దారుణంగా చావడం కోసమా?.. వేదాంత ధోరణిలో జగ్గూ భాయ్

    |

    కరోనా వైరస్ వచ్చి ప్రపంచానికి మంచి చేసిందో చెడు చేసిందో చెప్పడం కష్టం అవుతోంది. కరోనా వైరస్ విజృంభించడం వల్ల జనమంతా ఇంట్లోనే ఉంటున్నారు.. దీంతో ప్రకృతి స్వచ్చంగా మారిపోయింది. కలలో కూడా చూడని విధంగా నదులు, గాలి, నీరు అన్ని కాలుష్యరహితంగా మారిపోయాయి. మనుషులపై ప్రకృతి సంధించిన యాంటి వైరసే కరోనా.

    మనం ఇన్నాళ్లుగా ప్రకృతిని నాశనం చేసిన దానికి బదులుగా ఇప్పుడు మానవాళిపై పగను తీర్చుకుంటోందని కరోనా వైరస్‌పై వచ్చే లెక్కలేనన్ని జోకుల్లో ఇది కూడా ఒకటి. అయితే ఈ కరోనా వచ్చి ఇంకెన్నో విషయాలను మానవాళికి కనువిప్పును కలిగించాయి. వాటి గురించి మన జగ్గూ భాయ్ ఓ ఘటనను ఉదాహరణగా తీసుకుని వేదాంథ ధోరణిని ఎత్తుకున్నాడు. అసలు విషయం ఏంటో ఓ సారి చూద్దాం.

    కరోనాకు తారతమ్యాలు లేవు..

    కరోనాకు తారతమ్యాలు లేవు..

    కరోనా వైరస్‌కు తారతమ్యాలు లేవు. అది ఎప్పుడూ కూడా పేద, బీద, బలహీన వర్గం, సంపన్న వర్గం అని తేడా చూపించలేదు. అందర్నీ ఒకేరకంగా బయపెడుతోంది. కోట్లకు పడగలెత్తిన వారు కూడా కరోనా ముందు తలవంచాల్సిందే. నిరుపేద అయినా సరే కరోనా ముందు సాగిల పడాల్సిందే.

    ప్రపంచాన్ని గుప్పిట పట్టిన కరోనా..

    ప్రపంచాన్ని గుప్పిట పట్టిన కరోనా..

    ప్రపంచం మొత్తాన్ని గుప్పిట పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్‌కు అగ్రరాజ్యం సైతం కుదేలైంది. ప్రపంచాన్ని శాసించ గల సత్తా ఉన్న అమెరికా నేడు కరోనాతో కుప్పకూలిపోతోంది. దేశాధ్యక్షులు, ప్రధానులు ఇలా ఎవ్వరైనా కరోనాను బయపడాల్సిందే. కోట్లకు అధిపతి అయిన ఓ కోటీశ్వరుడు కరోనాతో మృతి చెందడంపై అతని కూతురు రాసిన ఓ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    సంపద అంతా ఇంట్లోనే

    పోర్చుగల్ దేశంలోని శాంటాండర్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆంటోనియో పియారా. ఓ కోటీశ్వరుడు. కానీ కరోనాతో కన్నుమూశాడు. దీనిపై ఆయన కూతురు స్పందిస్తూ.. ‘మాకు ఎంతో సంపద ఉంది.. ఉచితంగా లభించే గాలి దొరక్క ఒంటరిగా మా తండ్రి చనిపోయాడు. కానీ మా సంపద మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది' అంటూ ఎంతో గొప్ప మాట చెప్పింది. దీన్ని ఉదాహరణగా తీసుకుని జగ్గూ భాయ్ ఎమోషనల్ అయ్యాడు.

    Recommended Video

    #BeTheRealMan: Sampoornesh Babu's Video Goes Viral
    ఇలాంటి చావుకోసమా?

    ఇలాంటి చావుకోసమా?

    పోర్చుగల్ కోటీశ్వరుడి ఘటనను ఉదహరిస్తూ జగపతి బాబు ఈ విధంగా స్పందించాడు. ‘అతను బతకాడిని అవసరమైన గాలిని ఆయనకున్న సంపద తీసుకురాలేకపోయింది. మనం జీవితాంతం నిర్విరామంగా పరిగెడుతూనే ఉన్నాం.. కానీ దేని కోసం.. ఇలాంటి భయంకరమైన, బాధాకరమైన చావు కోసమా? సంపదతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఎప్పటికీ పోల్చలేమ'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Corona Effect Jagapathi Babu Emotional Tweet About Health And Wealth. He Says That His billions couldn't buy him the air he needed to live. We're running breathless our whole life for what? To die a miserable death?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X