కరోనా ఎఫెక్ట్ : ఎన్నో అంచనాలు అయినా తప్పలేదు.. నాని సినిమాకు పెద్ద దెబ్బ
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ వందల మందిని పొట్టన బెట్టుకోగా..ఇండియాలోనూ వ్యాపించింది. ఇప్పటికే ఈ వైరస్ మూలంగా ఇద్దరు చనిపోయారు. దాదాపు70మందికి ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కొన్ని నగరాల్లో కాలేజీలు, స్కూళ్లు, ఆఫీస్‌లు కూడా మూసి వేశారు. ఇక సినీ ఇండస్ట్రీకి కరోనా గొడ్డలి పెట్టులా మారింది.

వాయిదా పడుతున్న సినిమాలు..
కరోనా దెబ్బకు థియేటర్లన్నీ ఖాళీగా ఉండటంతో బాక్సాఫీస్ వెలవెలబోతోంది. కలెక్షన్లు సినిమాలన్నీ నష్టపోతోన్నాయి. గుంపులు గుంపులుగా ఉండకూడదనీ, అవసరమైతే గానీ బయటకు వెళ్లకూడదని ప్రభుత్వాలు సూచించడంతో అన్ని మూతపడుతున్నాయి.

కేరళలో థియేటర్లు బంద్
కరోనా దెబ్బకు కేరళలో థియేటర్లు మొత్తం మూత పడ్డాయి. ప్రభుత్వం కోరిక మేరకు మాలీవుడ్ అంతా సమావేశమై ఓ వారం పాటు థియేటర్లను క్లోజ్ చేస్తున్నామని ప్రకటించింది. దీంతో మోహన్ లాల్ మరక్కార్ చిత్రం కూడా వాయిదా పడింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన, జాగ్రత్తలు చెబుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో థియేటర్లను కూడా మూసి వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎటువంటి నిజం లేదని క్లారిటీగా చెప్పారు.
తాజాగా నాని సినిమాకు దెబ్బ..
నాని, సుధీర్ బాబు కాంబోలో వస్తోన్న V చిత్రంపై అంచనాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని V చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో ఈ మూవీని విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











