twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపిచంద్ మళ్ళీ కష్టాలు.. ఇక విలన్ రోల్స్ చేయాల్సిందేనా?

    |

    టాలీవుడ్ లో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో మంచి మనసున్న హీరోల లెక్క తక్కువే. ఇకపోతే మంచి పేరుతో మ్యచో మ్యాన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపిచంద్. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో మనోడు ముందుంటాడని టాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయమే. హీరోగా ఎదగడానికి గోపి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

    విలన్ నుంచి హీరో..

    విలన్ నుంచి హీరో..

    హీరోగా మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో జయం సినిమాతో విలన్ గా చేసి సక్సెస్ అందుకున్న గోపిచంద్ ఆ తరువాత మెల్లమెల్లగా హీరో స్థాయికి ఎదిగాడు. మధ్యలో కొన్ని విలన్స్ ఆఫర్స్ వచ్చినప్పటికీ గోపిచంద్ ఒప్పుకోలేదు. కానీ తనకు నచ్చితే పూర్తిగా విలన్స్ రోల్స్ కాకుండా నెగిటివ్ షెడ్ లో కనిపించడానికి ఒప్పుకుంటాను అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు.

     వరుసగా ఫెయిల్యూర్స్..

    వరుసగా ఫెయిల్యూర్స్..

    గోపిచంద్ కెరీర్ మొదట్లో యజ్ఞం, రణం, లక్ష్యం అంటూ వరుస విజయాలతో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని అందుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ డీలా పడ్డప్పటికి వెంటనే లౌక్యం, సాహసం సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆ తరువాత చేసిన ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. పంతం, చాణక్య అంటూ ఇటీవల వచ్చిన సినిమాలు దారుణమైన రిజల్ట్ ని అందుకున్నాయి. దీంతో మళ్ళీ ఫామ్ లోకి రావడానికి గోపిచంద్ విలన్ వేషాలు వేసుకోవాల్సిందేనా? అని రూమర్స్ వస్తున్నాయి.

    కరోనా దెబ్బకు సీటీమర్ డౌటే..?

    కరోనా దెబ్బకు సీటీమర్ డౌటే..?

    కరోనా కారణంగా గోపిచంద్ కెరీర్ కి మరొక గండం వచ్చి పడింది. సీటిమార్ సినిమా ఆగిపోయినట్లు టాక్ వస్తోంది. అతని మార్కెట్ కి మించి బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు ఇప్పుడు గ్యాప్ రావడంతో మనసు మార్చుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడి గత సినిమాలు కూడా పెద్దగ సక్సెస్ అయ్యింది లేదు. ఇక నిర్మాతలు ఎటు తేల్చుకోలేక సతమతమవుతున్నారట. సీటిమార్ రిలీజ్ అయ్యేది కూడా డౌటే అంటున్నారు.

    Recommended Video

    Netra Movie Audio Launch || Aishwarya || Satyanand ||
    మాస్ హీరోనే కానీ..

    మాస్ హీరోనే కానీ..

    గోపిచంద్ బయట ఎంత సింపుల్ గా కనిపించినా తెరపై కనిపిస్తే మాత్రం మాస్ హీరోగా దర్శనమిస్తాడు. మంచి కటౌట్ ఉన్న హీరోనే గాని సరైన కథలు దొరక్క బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ని పెంచుకోలేకపోతున్నాడు. ఇక స్టార్ డైరెక్టర్స్ కూడా గోపిచంద్ తో ఎక్కువగా రిస్క్ చేయడం లేదు. కానీ మంచి మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సబ్జెక్టు సెట్టయితే ఈ హీరోకి తిరుగుండదనే చెప్పాలి. మరి ఆ టైమ్ ఈ మంచి హీరోకి ఎప్పుడొస్తుందో చూడాలి.

    English summary
    Gopichand's struggling with corona lock down, his upcoming movie being seetimaar stopped. Producers who are budgeting beyond his market are now suspected to have changed the gap. Directed by Sampath Nandi, the film is being made into a sports drama. Even the director's past films have not been a big success.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X