twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా అభిమానులకు రామ్ చరణ్ రిక్వెస్ట్.. అదే మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక!

    |

    ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది. భారత దేశంలోనూ కరోనా కేసులు నమోదుకావడంతో అంతా అలర్ట్ అయ్యారు. ప్రభత్వ సూచనల మేరకు జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అభిమానులకు రామ్ చరణ్ రిక్వెస్ట్ చేస్తూ అఫీషియల్ నోట్ పోస్ట్ చేశారు. వివరాల్లోకి పోతే..

    కరోనా ఎఫెక్ట్.. సెలబ్రిటీల రియాక్షన్

    కరోనా ఎఫెక్ట్.. సెలబ్రిటీల రియాక్షన్

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. మన దేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న భయం పోగొట్టి, కరోనా పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించేందుకు గాను పలువురు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇదే బాటలో ఇటీవలే రామ్ చరణ్, ఎన్టీఆర్ కొన్ని సూచనిలిస్తూ వీడియోతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

    కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం

    కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం

    మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రద్దీ ప్రదేశాల్లో తిరగకూడదని పేర్కొంటూ స్కూల్స్, కాలేజెస్, థియేటర్స్ లాంటి జనసమూహం ఉండే ప్రదేశాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ వ్యక్తిగత వేడుకలు (బర్త్ డే, మ్యారేజ్ డే) లాంటివి రద్దు చేసుకుంటున్నారు.

    మోహన్ బాబు బాటలో రామ్ చరణ్

    మోహన్ బాబు బాటలో రామ్ చరణ్

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే బాటలో రామ్ చరణ్ కూడా ఓ ప్రకటన జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 27న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తన పుట్టినరోజు వేడుకులను జరపవద్దని అభిమానులకు మనవి చేశారు.

    మెగా అభిమానులకు రిక్వెస్ట్..

    మెగా అభిమానులకు రిక్వెస్ట్..

    ''మీకు నా మీద ఉన్న ప్రేమ, నా పుట్టినరోజును పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇలాంటి సమయంలో మనం సాధ్యమైనంతవరకు జనసాంద్రత తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి'' అని పేర్కొంటూ లేఖ రాశారు చెర్రీ.

    Recommended Video

    Anukunnadi Okati Ayinadi Okati : Dhanya Balakrishna, Siddhi Idnani Request To Audience
     అదే మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక..

    అదే మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక..

    ''మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి. అదే నాకు ఈ సంవత్సరం మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక. నా మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారని ఆశిస్తున్నాను'' అని రామ్ చరణ్ ఆ లేఖలో తెలియజేశారు.

    English summary
    In Telangana state all theaters and public places could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported. Now Ram Charan also cancelled his birthday celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X