కరోనా దెబ్బకు 'ఇష్క్' సినిమా వాయిదా
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి ఇబ్బందులు మొదలయ్యాయి. కరోనా తగ్గుముఖం పట్టిందని హ్యాపీగా సినిమాలను రిలీజ్ చేసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో మళ్ళీ పరిస్థితులు భయానకంగా మారాయి. థియేటర్స్ మొత్తం క్లోజ్ చేయనున్నట్లు థియేటర్స్ ఓనర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది.
ఇక ఆ నిర్ణయంతో చిన్న సినిమాలు విడుదలను వాయిదా వేసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం యువ హీరో తేజ సజ్జా నటించిన 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టొరీ' విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 23న శుక్రవారం విడుదల కావడానికి రెడీగా ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఇక సినిమా థియేటర్లు క్లోజ్ అవ్వడంతో విడుదల కూడా వాయిదా పడింది.

తేజ సజ్జా ఈ ఏడాది మొదట్లో జాంబీ రెడ్డితో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇష్క్ సినిమాతో కూడా మరో మంచి విజయాన్ని అందుకుందామని ప్రమోషన్ డోస్ పెంచిన సమయంలో కరోనా గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పటికే శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ, టక్ జగదీష్ సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మళ్ళీ పరిస్థితులు నార్మల్ అయిన రోజునే యధావిధిగా థియేటర్స్ తెరవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











