twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్.. కదిలిన ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్

    |

    క‌రోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అగ్రా రాజ్యమైతే ఇప్పటికే అతలాకుతలమైంది. లక్షల సంఖ్యలో అక్కడి ప్రజలు కరోనా బారిన పడ్డారు. మనదేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 2400 మందికి పైగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

    ఇలాంటి విపత్కర పరిస్థితులో దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినీ పరిశ్రమ సైతం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిలబడ్డారు. అయితే 24 / 7 ఏరోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని తెలిపారు.

    Corona Effect Telugu Film Journalists Association Helps Journalists

    తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ ప్రెసిడెంట్ ల‌క్ష్మినారాయ‌ణ గారు మాట్లాడుతూ.." ఫీల్డ్‌లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి , వీడియో జ‌ర్న‌లిస్ట్ ల‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకుల తో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము.

    ఏ ఓక్క‌రూ ఆక‌లి తొ వుండ‌కూడ‌ద‌నేది మ‌న అసోషియెష‌న్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ గారికి గాని, రాంబాబు(tv5) గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు.. మీ అంద‌రికి చివ‌రిగా నా ప్ర‌త్యేఖ‌మైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా వుండి పోరాడాలి.. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్ళి అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకొవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా కొరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదండుగా వున్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల'ని తెలిపారు.

    English summary
    Corona Effect Telugu Film Journalists Association Helps Journalists. Telugu Film Journalists Association Come Forward To Help Cine Journalists WHo Are In Trouble.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X