నయనతార, విఘ్నేష్ శివన్‌కు కరోనా పాజిటివ్! కోలీవుడ్ ప్రముఖులు అప్రమత్తం
తమిళ సినిమా పరిశ్రమను కరోనావైరస్ కుదిపేస్తున్నది. తాజాగా లేడి సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ కోవిడ్19 బారిన పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తతో దక్షిణాది సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైంది. అయితే ఈ వార్తలపై అటు నయనతార గానీ, విఘ్నేష్ శివన్ కూడా స్పందించకపోవడం అనేక సందేహాలకు ఊతమిస్తున్నది. అంతేకాకుండా కొంతమంది యాక్టర్స్ కూడా కరోనా భారిన పడినట్లు టాక్ వచ్చింది. అయితే వివరాల్లోకి వెళితే

చాలా రోజుకు తరువాత..
నయనతారతో దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరు రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తమిళ్ మీడియాలో గ్యాప్ లేకుండా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇకపోతే చాలా రోజుకు తరువాత ఎవరు ఊహించని రూమర్ తో ఈ జంట వార్తల్లో నిలిచింది.

కరోనా పాజిటివ్ అని తెలడంతో..
డైరెక్టర్ విగ్నేష్ శివన్ తన కొత్త సినిమాకు సంబంధించిన కొన్ని ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా ఇటీవల చెన్నైలో కొంతమంది టెక్నీషియన్స్ ని అలాగే నటీనటులను కలిశాడు. అయితే సడన్ గా ఆయన కలిసిన వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తెలడంతో విగ్నేష్ శివన్ కి కూడా పాజిటివ్ వచ్చి ఉంటుందని రూమర్స్ వచ్చాయి.

నయనతార కూడా..
రెగ్యులర్ గా కలుసుకునే జోడి కాబట్టి విగ్నేష్ తో పాటు నయనతార కూడా కరోనా భారిన పడే ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ వచ్చిన కథనాలు అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ఆ రూమర్స్ డోస్ పెరగకముందే నయనతార తన టీమ్ ద్వారా మీడియాకు క్లారిటీ ఇచ్చింది. నయన్ కి క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి కరోనా రూమర్స్ పై స్పందించారు.
Recommended Video

ఎలాంటి నిజం లేదని..
విగ్నేష్ శివన్ కి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో పాజిటివ్ వచ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటూ.. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రాలేదని క్లారిటిగా చెప్పారు. దీంతో నయనతార అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా పాజిటివ్ ల సంఖ్య 50వేలు దాటడంతో కొన్నిచోట్ల లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా సినిమా షూటింగ్స్ ని నిలిపివేశారు.


Click it and Unblock the Notifications











