కరోనాతో బాలీవుడ్‌కు భారీ దెబ్బ.. ఎన్ని వందల కోట్ల నష్టమంటే
ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కారణంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై భారీ దెబ్బ పడింది. పలు సినిమాల షూటింగులు రద్దు కావడంతో బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, బీహార్, పంజాబ్, ఏపీ, తెలంగాణలో సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 4 వేల థియేటర్లు మూతకు గురయ్యాయి.
బాలీవుడ్ సినిమా వసూళ్లపై కరోనా ప్రభావం భారీగానే పడింది. తొలి వారంలో టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ3 చిత్రం రూ.90.67 కోట్లు వసూలు చేయగా, ఇర్ఫాన్ ఖాన్ అంగ్రేజీ మీడియం మూవీ రూ.10 కోట్లు వసూలు చేసింది. ఇక రెండోవారంలో పరిస్థితి దారుణంగా తయారైంది.

కరోనా కారణంగా భాగీ3 కలెక్షన్ల విషయంలో 30 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది. థియేటర్ల మూసివేత కారణంగా అంగ్రేజీ మీడియం సినిమా వసూళ్లు భారీగా దెబ్బ తిన్నాయి. ఈ వైరస్ కారణంగా సినిమా రిలీజ్, షూటింగ్ వాయిదా పడటం వల్ల బాలీవుడ్‌పై సుమారు 800 కోట్ల మేర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.
కరోనా వైరస్ కారణంగా బ్రహ్మస్త్ర, సూర్యవంశీ, ఉద్దమ్‌సింగ్ బయోపిక్, జేమ్స్‌బాండ్ చిత్రం నో టైమ్ టూ డై, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 చిత్రాల రిలీజ్ వాయిదా పడ్డాయి.


Click it and Unblock the Notifications











