హైదరాబాద్‌లో కరోనా కలకలం.. ఛార్మి షాకింగ్ వీడియో.. తప్పని పరిస్థితుల్లో ఇలా!!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా మహమ్మారి. చైనా దేశం వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ దాదాపు అని దేశాలకు విస్తరించింది. ఇప్పటికే 2000 పైచిలుకు జనం ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్న ఈ వైరస్ హైదరాబాద్ నగరాన్ని తాకింది. అయితే ఈ ఉదంతంపై ఛార్మి కాస్త అడ్వాన్స్ కావడం, ఆ తర్వాత సారీ చెప్పడం జరిగాయి. ఇంతకీ ఏం జరిగింది? ఛార్మి ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? వివరాల్లోకి పోతే..

 హైదరాబాద్‌లో కరోనా.. వణికిపోతున్న జనం

హైదరాబాద్‌లో కరోనా.. వణికిపోతున్న జనం

భారతదేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించటంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో కూడా ఒక కరోనా వైరస్ కేసు నమోదు అయ్యిందని తెలియడంతో తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా మహమ్మారి దాడిని ఎలా ఎదుర్కోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో కరోనా కేసు

బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో కరోనా కేసు

తెలంగాణలో కరోనా వైరస్ కలకలంపై అఫీషియల్ ప్రకటన చేశారు. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న అతను దుబాయ్‌ వెళ్లాడని, హాంకాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడని.. ఇక తర్వాత బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌ చేరుకున్నది చెప్పారు. అతనికి తీవ్ర జ్వరం రావటంతో గాంధీ ఆస్పత్రికి వచ్చాడని, టెస్ట్ చేయగా కారోనా లక్షణాలు బయటపడ్డాయని తెలిపారు.

కరోనాకు స్వాగతం.. ఛార్మి షాకింగ్ వీడియో

కరోనాకు స్వాగతం.. ఛార్మి షాకింగ్ వీడియో

దీంతో వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమమై వ్యాధిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో హీరోయిన్, నిర్మాత ఛార్మి కరోనాపై సోషల్ మీడియా టిక్ టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో కరోనా వైరస్‌కు స్వాగతం, ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 ఛార్మిపై ఫైర్.. అందరివీ అవే కామెంట్స్

ఛార్మిపై ఫైర్.. అందరివీ అవే కామెంట్స్

కరోనా మహమ్మారి దాడిపై అంతా భయ భ్రాంతులకు గురవుతుంటే ఛార్మి మాత్రం చాలా లైట్ తీసుకుంటూ ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఛార్మిపై విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

Recommended Video

Puri Jagannadh & Charmy Kaur Bought Range Rover Vogue And BMW 7 Series Car || Filmibeat Telugu

సారీ చెబుతున్నా.. ఇంకోసారి ఇలా చేయను

దీంతో తన తప్పు తెలుసుకున్న ఛార్మి.. చివరకు అదే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ''మీరు చేసిన కామెంట్స్‌ చూశాను. ఆ వీడియో చేసినందుకు సారీ చెబుతున్నా. ఇది చాలా సున్నితమైన అంశం. అపరిపక్వత, అవగాహనాలేమితో అలా మాట్లాడాను. ఇకపై ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కావు'' అని పేర్కొంది ఛార్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X