కరోనా ఎఫెక్ట్: నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. ఒక్క మనిషి తప్ప అంతా అంటూ!!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించి ఇప్పటికే వేలాది మంది మరణించారు. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్లిస్తోంది. దీంతో అన్నిదేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై వైద్య బృందాలను రంగంలోకి దించాయి. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

హైదరాబాద్ చేరిన కరోనా వైరస్

హైదరాబాద్ చేరిన కరోనా వైరస్

క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని కూడా చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఒక కేసు, ఢిల్లీలో మరోకేసు నమోదు కావడంతో తెలంగాణ సహా భారత ప్రజానీకం పలు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.

మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే..

మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే..

తాజాగా ఇదే కరోనా ఎఫెక్ట్ అంశంపై స్పందించిన నాగబాబు.. ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చనిపోతే.. ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయని అన్నారు. మానవుడు లేకుంటే మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయని చెప్పారు.

కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప అందరూ..

కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప అందరూ..

''సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప'' అని నాగబాబు ట్వీట్లు చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్లు చూసి నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. 'ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 ఛార్మి క్షమాపణలు.. కరోనా ఎఫెక్ట్

ఛార్మి క్షమాపణలు.. కరోనా ఎఫెక్ట్

ఇటీవలే ఛార్మి సైతం కరోనా పై స్పందించి చివరకు సారీ చెప్పింది. కరోనా వచ్చింది.. ఆల్ ది బెస్ట్ అంటూ వీడియో పోస్ట్ చేసి ఛార్మి చిక్కుల్లో పడింది. చాలామంది ఛార్మి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో చివరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది ఛార్మి.

Recommended Video

Puri Jagannadh & Charmy Kaur Bought Range Rover Vogue And BMW 7 Series Car || Filmibeat Telugu
ఉపాసన సహా టాలీవుడ్ సెలబ్రిటీలు

ఉపాసన సహా టాలీవుడ్ సెలబ్రిటీలు

ఇకపోతే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొణిదెల ఉపాసన సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఎయిర్ పోర్ట్‌లో మాస్క్ ధరించి కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవడం, ఆ ఫొటోలో వైరల్ కావడం జరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X