twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌కి కరోనా వైరస్ దెబ్బ: కొత్త సినిమాల విడుదల వాయిదా.. థియేటర్లు క్లోజ్

    |

    ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ బాగా విస్తరించి ఇప్పటికే ఎంతోమంది మరణించారు. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఏ ఒక్కరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో చైనా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు క్లోజ్ చేశారు. అంతేకాదు కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేశారు.

    మూతపడిన 70000 థియేటర్స్

    మూతపడిన 70000 థియేటర్స్

    కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఎవరికి వారు నివారణ చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఎక్కువమంది ఒక్కటచోట ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ కారణంగా చైనా దేశంలో ఉన్న 70000 థియేటర్స్ యాజమాన్యాలు స్వచ్చందంగా తమ తమ థియేటర్స్ క్లోజ్ చేసేశాయి.

    వైరస్ విజృంభణ.. కొత్త సినిమాల విడుదల వాయిదా

    వైరస్ విజృంభణ.. కొత్త సినిమాల విడుదల వాయిదా

    ప్రతి ఏడాది జనవరి 25 నుంచి చైనాలో న్యూ ఇయర్ లూనార్ హాలిడేస్ జరుపుకోవడం అలవాటు. ఈ హాలిడేస్‌లో చైనా థియేటర్స్ అన్నీ కళకళలాడుతూ భారీగా బాక్సాఫీస్ వసూళ్లు రాబడతాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు న్యూ ఇయర్ లూనార్ హాలిడేస్ కోసం రిజర్వ్ చేయబడ్డాయి. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఆ సినిమాల విడుదలను వాయిదా వేసేశారు.

    Recommended Video

    Coronavirus : Possible Evacuation Of Indians From Chinese Wuhan City || Oneindia Telugu
    చైనా గవర్నమెంట్ డిసీజన్.. ఆదేశాలు జారీ

    చైనా గవర్నమెంట్ డిసీజన్.. ఆదేశాలు జారీ

    చైనా చిత్రసీమ తెరకెక్కించిన పలు అంతర్జాతీయ సినిమాల విడుదలను కూడా వాయిదా వేసింది చైనా గవర్నమెంట్. చైనా విడుదల చేయకుండా మరే ఇతర దేశంలోనూ ఆయా సినిమాల విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చైనాటౌన్ 3, లీప్ సినిమాలు కూడా వాయిదా వేయక తప్పలేదు.

     బాక్సాఫీస్‌కి కరోనా వైరస్ దెబ్బ

    బాక్సాఫీస్‌కి కరోనా వైరస్ దెబ్బ

    గతేడాది చైనాలో ఇదే లూనార్ హాలిడే సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద 360 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వసూలయ్యాయి. కానీ ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా థియేటర్స్ మూతపడటంతో బాక్సాఫీస్‌కి భారీ దెబ్బ పడింది. ఇప్పటిదాకా ఈ హాలిడే సీజన్‌లో కేవలం 2 మిలియన్ డాలర్స్ మాత్రమే వసులుయ్యాయి.

    హడలెత్తిపోతున్న హైదరాబాద్.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద తనిఖీలు

    హడలెత్తిపోతున్న హైదరాబాద్.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద తనిఖీలు

    చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని కూడా భయపెడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కరోనా వైరస్‌ కారణంగా హడలెత్తిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    English summary
    In China the 70,000 theaters could remain closed through the end of February as the government works to contain the virus, Deadline reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X