twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దగ్గుబాటి రానాపై కరోనా ఎఫెక్ట్.. తప్పలేదు మరి!!

    |

    కరోనా ఎఫెక్ట్ దగ్గుబాటి రానాపై కూడా పడింది. కరోనా వైరస్‌ని అరికట్టడంలో భాగంగా ఇప్పటికే థియేటర్స్ మూతపడగా, పలు సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా వేసేశారు. తాజాగా ఇదే కారణంగా దగ్గుబాటి రానా తాజా సినిమా 'అరణ్య' విడుదలను కూడా వాయిదా వేయలేక తప్పలేదు.

    పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మూవీ 'హాథీ మేరే సాథీ'. తెలుగులో ఈ సినిమాను 'అరణ్య' పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇందులో దగ్గుబాటి రానా లీడ్ రోల్ పోషించారు. ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్‌ విజేత రసూల్‌ సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేయడం విశేషం. ప్రభు సోల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్డ్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.

    CoronaVirus Effect On Rana Daggubatis Aranya

    తాజాగా కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ 19 క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఇటీవ‌లి కాలంలో వ‌స్తున్న వార్త‌ల‌ను దృష్టిలో ఉంచుకొని 'అర‌ణ్య'‌, 'హాథీ మేరే సాథీ', 'కాండ‌న్' (త‌మిళ వెర్ష‌న్‌) సినిమాల విడుద‌ల తేదీని మార్చాల‌ని నిర్ణ‌యించామని చిత్రయూనిట్ తెలిపింది.

    మా భాగ‌స్వాములు, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, ప్రేక్ష‌కుల అంద‌రి అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ.. మ‌నంద‌రి ఆరోగ్యాన్ని కోరుకుంటూ, ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వస్తాం. ఆరోగ్యంగా, భ‌ద్రంగా ఉండండి అని పేర్కొన్నారు చిత్ర నిర్మాతలు.

    English summary
    Rana Daggubati’s upcoming movie Aranya. The filmmakers have zeroed in on a release date with Rana's first look. Now this movie release postpone due to CoronaVirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X