For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పేలుతున్న కరోనా పుట్ట.. అర్ధంతరంగా ఆగిపోతున్న బడా సినిమాల షూట్స్.. తాజాగా ఆర్ ఆర్ ఆర్ కూడా

  |

  అనుకున్నట్టే అవుతోంది, కరోనా పుట్ట తెలుగు సినిమా షూటింగ్స్ లో పగులుతోంది. ఎప్పుడు ఏ షూటింగ్ ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం టాలీవుడ్ ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు లక్షలాదిగా పెరిగిపోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే స్థాయిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు కోర్టులు, కేంద్రం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. అత్యవసరం కాదు అనుకున్న అన్ని అంశాల మీద ఆంక్షలు విధించాలని కోర్టులు పట్టుబడుతున్నాయి. అయితే ఆర్థికంగా ప్రస్తుతానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా అన్ని అంశాల మీద ఆంక్షలు విధిస్తూ పోతే ఆదాయం కోల్పోతామేమోనని ప్రభుత్వాలు భయపడుతున్నాయి.

  బికినీలో హంసానందిని.. క్లీవేజ్‌ షో అదరగొట్టిన మిర్చి భామ

  సర్కారు వారి పాట, ఆచార్యలకు కరోనా బ్రేక్

  సర్కారు వారి పాట, ఆచార్యలకు కరోనా బ్రేక్

  అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని థియేటర్లలో విషయంలో హైకోర్టు తీవ్రంగా హెచ్చరించినా ఇంకా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాలు పక్కనపెడితే ప్రస్తుతానికి కరోనా కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు సైతం షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటే. చెప్పిన సమయానికి అయినా కొంచెం అటూ ఇటూగా లేటుగా అయినా రిలీజ్ చేయాలని భావిస్తున్న బడా హీరోలు వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ అనూహ్యంగా షూటింగ్ చేస్తున్న యూనిట్ లోనే కరోనా కేసులు భారీ ఎత్తున బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, చిరంజీవి రామ్ చరణ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఆచార్య షూటింగ్ నిలిపివేశారు.

  ఆర్ ఆర్ ఆర్ కూ తప్పలేదు

  ఆర్ ఆర్ ఆర్ కూ తప్పలేదు

  తాజాగా ఆ లిస్టులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా చేరింది. యూనిట్ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రస్తుతానికి షూటింగ్ ఆపేస్తే మంచిది అని అటు నిర్మాతలతో పాటు రాజమౌళి కూడా భావించి షూటింగ్ అర్ధాంతరంగా నిలిపివేసినట్లు సమాచారం. నిజానికి ప్రతి రోజు షూటింగ్ కి వెళ్లేముందు కరోనా టెస్టులు చేయించుకోవాలని నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు టెస్టులు చేయించి ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొంటున్నారు సినిమా యూనిట్. అయినా సరే ఎక్కడి నుంచి వస్తుందో మాయదారి మహమ్మారి, కరోనా కేసులు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో షూటింగ్ చేయడం సరి కాదని భావించిన రాజమౌళి షూటింగ్ ను నిలిపివేసినట్లు సమాచారం.

  పుష్ప అప్పట్లోనే ఆపేసి

  పుష్ప అప్పట్లోనే ఆపేసి

  నిజానికి పుష్ప సినిమా మారేడుమిల్లి అడవి లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో యూనిట్ లోని కొందరు టెక్నీషియన్స్ కరోనా బారిన పడగా అందులో ఒకరి పరిస్థితి విషమించి మృతి చెందారని దీంతో సినిమా షూటింగ్ ఆపివేసి అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పేశారు అనే ప్రచారం జరిగింది. ఈ అంశం మీద అధికారిక ప్రకటన ఏవీ వెలువడలేదు. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కరోనా కేసులు సెకండ్ వేవ్ లో భారీ ఎత్తున ప్రజలను భయపెడుతున్నాయి అని మాత్రం చెప్పక తప్పదు.

  Recommended Video

  Himaja With Pawan Kalyan In PSPK 27
  హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ తో ?

  హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ తో ?

  ఇక త్వరలో తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన కూడా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు తాజాగా తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. మరో 48 గంటల్లో లాక్ డౌన్ విధించడమా ? లేక కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించడమా అనేది తేల్చి చెప్పాలని లేదా తామే ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఈసారి కఠిన ఆంక్షలు అమలు అవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధిస్తే చిన్న సినిమాలు రిలీజ్ అయినా అవి కూడా ఇబ్బంది పడక తప్పదు అనే వాదన వినిపిస్తోంది.

  English summary
  Due to huge surge in corona cases over all india, and daily positive cases in shooting, all the big films of tollywood is slowly getting halted. already SarkaaruVaariPaata & Acharya Shoot Halted Due to Corona Second Wave,Now RRR Joins the List.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X