కరోనా ఎఫెక్ట్.. టాలీవుడ్‌‌కు పెద్ద దెబ్బ.. చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం!!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో బయపెడుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాలో వేలాది మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. భారతదేశంలోకి చొచ్చుకు వచ్చిన కరోనా తెలంగాణలోనూ విజృంభించింది. అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. జన సమూహాలుండే ప్రదేశాలను మూసి వేయాలని ఆదేశించింది. అందులో భాగంగా థియేటర్స్, మాల్స్, స్కూల్స్, కాలేజీలు, పబ్స్, క్లబ్స్ మూసివేయించింది. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ కూడా కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది అవేంటో ఓ సారి చూద్దాం.

బాక్సాఫీస్ వెలవెల..

బాక్సాఫీస్ వెలవెల..

కరోనా వైరస్ దెబ్బకు బాక్సాఫీస్ విలవిల్లాడుతుంది. గత కొన్ని రోజులుగా కలెక్షన్స్ లేక బాక్సాఫీస్ బోసి పోయింది. థియేటర్లలో జనాలు లేక అంతా చప్పబడిపోయింది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లను కూడా మూసి వేశారు.

సినిమాలు వాయిదా..

సినిమాలు వాయిదా..


కరోనా వైరస్‌‌కు బయపడి ప్రజలెవరూ బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఇక థియేటర్ల వైపు చూసే నాథుడే లేకుండాపోయాడు. ఈ దెబ్బకు కొన్ని సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే నాని వీ చిత్రం వాయిదా వేసినట్టు ప్రకటించారు.

షూటింగ్స్ రద్దు..

షూటింగ్స్ రద్దు..

కొన్ని దేశాలు, రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో షూటింగ్స్ చేయడానికి అనుమతిని ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే సుకుమార్, అల్లు అర్జున్ సినిమాకు బ్రేక్ పడింది. కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా నిలబడ్డ చిరంజీవి.. ఆచార్య సినిమా షూటింగ్ పది, పదిహేను రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.

Recommended Video

Corona Virus India : Upasana Konidela Comments On Corona Virus In Telangana
24 క్రాఫ్ట్స్ సమావేశం..

24 క్రాఫ్ట్స్ సమావేశం..


కరోనా స్వైర విహారం చేస్తున్నందున చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ విభాగానికి చెందిన పెద్దలందరూ సమావేశం అయ్యారు. టాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ అన్నింటిని మార్చి 31 వరకు రద్దు చేశారు. దీంతో ఈ పదిహేను రోజులు చిత్ర పరిశ్రమలో ఎటువంటి కార్యకలాపాలు జరగవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X