సినీ, రాజకీయ ప్రముఖుల్లో కరోనా టెన్షన్.. ఆమె కారణంగా!! అదే అసలు సమస్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. చైనా సహా వందలాది దేశాల్లో వణుకు పుట్టిస్తున్న ఈ మహమ్మారి వైరస్ భారత దేశాన్నీ కంగారు పెడుతోంది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వ యంత్రాంగం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సింగర్ కనికకు కరోనా ఉన్నట్లుగా తేలడంతో ఆమెతో తిరిగిన వారందరికీ టెన్షన్ పట్టుకుంది. ఆ వివరాలు చూద్దామా..

ఆ విషయాన్ని దాచిపెట్టి.. అందరితో కలిసి

ఆ విషయాన్ని దాచిపెట్టి.. అందరితో కలిసి

విదేశాలకు వెళ్లొచ్చి, ఆ విషయాన్ని దాచిపెట్టిన సింగర్ కనిక కపూర్‌‌కి కరోనా పాజిటివ్ అని రావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే ఈమెతో కలిసిన వారి లిస్టులో 183 మంది ఉన్నట్లుగా తేలింది. వారందరికీ కరోనా పరీక్షలు జరుపుతున్నారు. ఇందులో 63 మందికి నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, మిగిలిన వారికి టెస్టులు చేస్తున్నామని చెబుతోంది ఆరోగ్య శాఖ.

విందులో సింగర్ కరోనా.. అంతా షాక్

విందులో సింగర్ కరోనా.. అంతా షాక్

లండన్ వెళ్లి అక్కడి నుంచి మార్చి 9న ఇండియా తిరిగి వచ్చిన సింగర్ కనిక.. వారం తర్వాత మార్చి 15న ఆదివారం రాత్రి విందులో పాల్గొంది. ఆ తర్వాతచూస్తే ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని తేలడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో ఆమె ఈ వారం పాటు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది అనే వివరాలు సేకరించడం జరిగింది.

టెన్షన్ పడుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు

టెన్షన్ పడుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ముఖ్యంగా.. బీజేపీ ఎంపీ, మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందుకు కనికా హాజరుకావడం మరింత టెన్షన్ వాతావరణం నెలకొల్పింది. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. దీంతో ఆయా వర్గాల్లో గుబులు పట్టుకుంది. ఆమెను కలిసిన వారందరి శాంపిల్స్ సేకరించి మహారాష్ట్రోలోని ప్రత్యేక ల్యాబులకు పంపుతున్నారు.

కనిక ఎఫెక్ట్ లిస్టులో వాళ్ళు కూడా..

కనిక ఎఫెక్ట్ లిస్టులో వాళ్ళు కూడా..

మార్చి 11 నుంచీ 16 మధ్య సింగర్ కనిక చాలా పార్టీల్లో పాల్గొంది. అంతేకాదు చాలా కార్యక్రమాల్లో ఎంతో మంది ప్రముఖులను కలిసింది. అదే ఇప్పుడు సమస్య అయ్యింది. సింగర్ కనిక ఎఫెక్ట్ లిస్టులో కొందరు ఎంపీలు, బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
గృహ నిర్భంధంలో సింగర్.. ట్రీట్‌‌మెంట్

గృహ నిర్భంధంలో సింగర్.. ట్రీట్‌‌మెంట్

ఇకపోతే ప్రస్తుతం సింగర్ కనికను గృహనిర్భంధంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఉత్తమ సౌకర్యాలను సమకూర్చి ఆమెను అనుక్షణం పర్యవేక్షిస్తూ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. అయితే ఆమె చికిత్సకు నిరాకరిస్తూ తనకు విలాసవంతమైన సౌకర్యాలు కావాలంటూ వైద్యులను, వైద్య సిబ్బందిపై దురుసుగా చర్చనీయాంశమైంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X