ఆ స్టార్స్‌లో కాస్ల్టీ ఎవరు? చీప్ ఎవరు?

By Bojja Kumar

సినిమాకు హీరో ఎంత ముఖ్యమో...హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. అందుకే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ల విషయంలో అందం, అభినయమే కాదు...సదరు హీరోయిన్లు నటిస్తే సినిమాకు లక్కు కలిసొస్తుందా? సినిమా హిట్టవుతుందా? అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు.

ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుని తెలుగు హీరోయిన్ల రేట్లు కోటికి పైచిలుకు పలుకుతున్నాయి. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రేటు విషయంలో అనుష్క, నయనతార, ఇలియాన, కాజల్, తమన్నా కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకునే లిస్టులో ఉన్నారు.

ఇక త్రిష, సమంత లాంటి వారు రూ. 80 లక్షల వరకు తీసుకుంటుండగా....తాప్సి, శృతి హాసన్, లాంటి వారు రూ. 50 నుంచి 60 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇక చార్మి, రిచా గంగోపాధ్యాయ్, పార్వతి మెల్టన్, ఇషా చావ్లా లాంటి వారు తీసుకునే రెమ్యూనరేషన్ 40 లక్షల లోపే...

హీరోయిన్ల విషయంలో అభినయంతో పాటు....ఎక్స్ ఫోజింగ్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. మంచి అభినయం, ఎక్స్ పోజింగ్ చేయడానికి అడ్డు చెప్పక పోవడం, వరుస హిట్లతో ట్రాక్ రికార్డు ఉంటే ఆ హీరోయినే ఇండస్ట్రీ టాప్ హీరోయిన్‌ స్థానంలో ఉంటోంది. గతంలో టాప్ హీరోయిన్ స్థానంలో ఇలియాన ఉంటే, ఆ తర్వాత అనుష్క, అనంతరం కాజల్ ఇలా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. భవిష్యత్‌లో టాప్ హీరోయిన్ ప్లేసులోకి వెళ్లడానికి రెడీగా ఉన్న భామ సమంతే అని పరిశ్రమ వర్గాల టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X