రామ్, తమన్నా ప్రేమకి ఖరీదైన ఇన్సూరెన్స్
రామ్, తమన్నాల కాంబినేషన్ లో ఎందుకంటే ప్రేమంట అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ని ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద ఈ మద్య జరిపారు.అయితే అక్కడ షూటింగ్ చేయటానికి ముందు ఆరు మిలియన్ యూరోల ఇన్సూరెన్స్ చెయ్యాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రామ్ తన ట్విట్టర్ లో తెలిపారు.ఆయన ట్వీట్ చేస్తూ...మేం ఓ సీన్ ని ఈఫిల్ టవర్ పాయింటాఫ్ వ్యూలో అక్కడున్న ప్లాట్ ఫాం మీద తీసారు. అందుకోసం అక్కడ ఆరు మిలియన్ యూరోల ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఫర్మిషన్ ఇవ్వనన్నారు.అయితే ఆ డబ్బుకు తగ్గ వర్త్ ఉంది. అది రేపు తెరపై చూడవచ్చు అన్నారు.
కరుణాకరన్ తో వర్క్ చేయాలన్నది తన డ్రీమ్..అంటూ సినిమా ప్రారంభోత్సవం నాడే చెప్పిన రామ్, కరుణాకరణ్ తో వర్క్ చేస్తోంటే అస్సలు టైమ్ తెలియదని చెప్పుకొచ్చాడు తాజాగా ఓ సందర్భంలో. 'కందిరీగ" మాస్ సినిమా అయితే, 'ఎందుకంటే ప్రేమంటే" క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, ఆన్ స్క్రీన్ తమన్నాతో రొమాన్స్ సూపర్బ్ గా వర్కవుట్ అవుతుందని రామ్ చెప్పుకొచ్చాడు. ఇక, హీరోయిన్లను అందంగా చూపించడంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న కరుణాకరన్, తమన్నాని ఎందుకంటే ప్రేమంట" సినిమా మరింత అందంగా చూపించబోతున్నాడట.


Click it and Unblock the Notifications











