ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హంగామా షురూ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 20 న 35 పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండగానే ఫాన్స్ హంగామా షురూ చేశారు. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ సాయంత్రమే ఎన్టీఆర్ ఫాన్స్ కామన్ డిపితో ట్రెండింగ్ మొదలు పెట్టారు.
అభిమానుల సంబరాల్లో సెలెబ్రిటీలు కూడా చేయి వేయడం విశేషం. దర్శకుడు బాబీ, కోనవెంకట్, సంగీత దర్శకుడు తమన్ వంటి సెలెబ్రిటీలంతా కామన్ డిపి గురించి ట్వీట్ చేసారు. మా రావణ్ బర్త్ డే కి కౌండౌన్ మొదలైంది అంటూ కోనవెంకట్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేయడం విశేషం. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











