నాగార్జున ఫామ్ హౌస్‌లో విషాదం.. కూలీలుగా పనిచేస్తున్న దంపతుల మృతి, కారణం ఏంటంటే!
అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారులోని పాపి రెడ్డి గూడ ప్రాంతంలో నాగార్జునకు ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో నాగార్జున వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకట రాజు(32), దుర్గ (30) దంపతులు ఈ ఫామ్ హౌస్ లో కూలీలుగా పనిచేస్తున్నారు.
అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో ఈ దంపతులిద్దరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దంపతులిద్దరూ ఫామ్ హౌస్ లోనే నివాసం ఉంటున్నారు. గత రాత్రి నుంచి ఇంట్లో కరెంటు పోవడంతో వెంకట రాజు ట్రాన్స్ ఫార్మర్ ని పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ తెగిపడి ఉన్న విద్యుత్ తీగని గమనించకపోవడంతో షాక్ తగిలి మృతువాత పడ్డాడు. భర్త విలవిల లాడుతుంటే దుర్గ కూడా అక్కడకు వెళ్లి విధ్యుత్ ఘాతానికి గురై మరణించింది.

దంపతులిద్దరూ అక్కడికక్కడే మరణించిన విషాదఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











