10 కోట్లు కట్టండి: ‘లింగా’ నిర్మాతకు కోర్టు షాక్!
హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లింగా చిత్రంపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. తన స్టోరీ లైన్ కాపీ కొట్టారనే ఆరోపణలతో రవిరత్నం కేసు వేసారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి ‘లింగా' నిర్మాతకు ఎదురు దెబ్బతగిలింది. రవిరత్నం వేసిన పిటీషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, శుక్రవారం మధ్యాహ్నంలోగా కోర్టులో రూ. 10 కోట్లు డిపాజిట్ చేయాలని చిత్ర నిర్మాతను సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. లేకుంటే చిత్ర ప్రదర్శన ఆపాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, కోర్టు ఆదేశాల మేరకు డబ్బు కడతామని, సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తెలిపారు. సినిమాను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12(రేపు) విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిపికెట్ పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రేపు 2300పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రజనీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సోనాక్షి, అనుష్క హీరోయిన్లుగా నటించారు.
లింగా కథ చాలా అద్భుతంగా ఉందని, నాకు బాగా నచ్చిందని, తెలుగు వారికి కూడా నచ్చుతుందని ఇటీవల ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ వెల్లడించారు. లింగా సబ్జెక్టు చాలా పెద్దదని, ఇంత భారీ చిత్రాన్ని కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయడం గొప్పవిషయమని రజనీకాంత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











