నటి శృతి రెండవ వివాహం చెల్లదని కోర్టు తీర్పు
బెంగళూరు : సినీ నటి రెండో పెళ్లి సినిమాలో మాదిరిగానే ఒడిదుడుకులకు లోనై చివరకు విషాదాంతమైంది. నిజ జీవిత మలుపులు సినిమాను తలదన్నే రీతిలో ఉంటాయని స్పష్టమైంది.ప్రముఖ నటి శృతి ఇటీవల చేసుకున్న వివాహం చెల్లదని ఫ్యామిలీ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. దీంతో నాలుగైదు నెలలుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించినట్లయింది. నటిశృతి సీనీ నిర్మాత మహేంద్రను తొలివివాహం చేసుకున్నారు. ఇటీవల చంద్రచూడ్ అనే పాత్రికేయుడిని రెండవ వివాహం చేసుకున్నారు.
నటి శ్రుతి- చంద్రచూడ్ చక్రవర్తి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ఇక్కడి ఫ్యామిలీ కోర్టు శుక్రవారం ప్రకటించింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వారిద్దరూ కోర్టుకు ఇప్పటికే లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో ఈ తీర్పు ఇస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అప్పటికే సినీ దర్శకుడు మహేందర్‌తో పెళ్లయి ఉన్న శృతి, బెంగళూరు పాత్రికేయుడు చంద్రచూడ్ చక్రవర్తి ప్రేమించుకుని, గత జూన్ ఆఖరులో చిక్కమగళూరు జిల్లాలోని ఒక గుళ్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ చంద్రచూడ్ భార్య మంజుళ కోర్టుకెక్కారు. తను బతికుండగానే తన భర్త చేసుకున్న రెండోపెళ్లిని రద్దు చేయాలని ఇక్కడి కుటుంబ కోర్టులో అర్జీ వేశారు. తన భర్త విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకున్నారని, న్యాయం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలు సాగాయి. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకుంటే చెల్లదని తీర్పు ప్రకటించారు. దీంతో శృతి, చంద్రచూడ్‌లు దూరం కావాల్సి ఉంది. చంద్రచూడ్ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఫలితంగా కొత్త కాపురం కష్టాల పాలైంది. ఈ నేపథ్యంలో కేసు విచారణలకు ఒకమారు శ్రుతి, చంద్రచూడ్‌లు వేర్వేరుగా హాజరై తమ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తన భర్త తనతోనే కలిసి ఉండాలని, కుటుంబ నిర్వహణకు ప్రతి నెల రూ.35వేలు నగదు, కొంత భరణం ఇవ్వాలంటూ మంజుళ వేసుకున్న మరో అర్జీపై విచారణ శనివారానికి వాయిదా పడిందని ఆమె తరుపు న్యాయవాది తెలిపారు.


Click it and Unblock the Notifications











