For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  దాడి కేసులో పొగరుబోతు స్టార్ హీరో (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  ముంబై: డబ్బు, హోదా, పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరో లెవెల్, తద్వారా వచ్చిన పొగరు తనం......ఎదుటి వారు తమనేమైనా అంటే సహించలేని గుణం, కట్టలు తెంచుకునే కోపం, దాడికి సైతం తెగబడే మూర్ఖత్వం. ఈ మధ్య ఇలాంటి లక్షణాలున్న సినిమా హీరోల సంఖ్య బాగా పెరిగిపోతోంది. మన టాలీవుడ్లోనూ ఓ యంగ్ స్టార్ హీరో అప్పట్లో రోడ్డుపై తన బాడీగార్డులతో చేయించిన రచ్చ అంతా ఇంతా ఇంతా కాదు.

  బాలీవుడ్లో పొగరుబోతు హీరోగా పేరుబడిన సైఫ్ అలీ ఖాన్ గతంలో ఓ స్టార్ హోటల్‌లో ఎన్నారైపై దాడి చేసిన కోసులో తాజా కోర్టు నిందారోపణలు నమోదు చేసింది. సైఫ్ తో పాటు అతని ఇద్దరు స్నేహితుల మీద ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది.

  సౌతాఫ్రికా బేస్డ్ బిజినెష్‌మేన్ ఇక్భాల్ మిర్ శర్మ కేసు వేయడంతో.... సైఫ్ అలీ ఖాన్ తన ఇద్దరు స్నేహితులు సకీల్ లడఖ్, బిలాల్ అమ్రోహిలను పోలీసులు రెండేళ్ల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 22, 2012న సైఫ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి తాజ్ హోటల్‌లో తనపై, తన మామ రమన్ పటేల్ దాడి చేసినట్లు ఇక్బాల్ మిర్ శర్మ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

  దాడి సంఘటన జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ వెంట భార్య కరీనా కపూర్, వదిన కరిష్మా కపూర్, స్నేహితులు మలైకా అరోరా ఖాన్, అమృత అరోరా ఇతర స్నేహితులు ఉన్నారు. తమ వెంట ఉన్న ఆడవారిపై ఎన్నారై బిజినెస్ మేన్ ఇక్భాల్ మిర్ శర్మ అసభ్యమైన కామెంట్స్ చేసారంటూ సైఫ్ అలీ ఖాన్ ఆరోపించారు. అప్పట్లో సైఫ్ అలీ ఖాన్, అతని ఇద్దరు స్నేహితులు ఈ దాడి కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యాయి. తాజా విచారణలో కోర్టు వీరిపై ఐపీసీ సెక్షన్ 325, 34 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది.

  బాలీవుడ్లో పలువురు స్టార్స్ ఈ మధ్య ఏదో ఒక కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ జైలు పాలైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ కూడా ఓ యాక్సిడెంట్ చేసిన కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

  సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే సినిమా 'హమ్‌షకల్స్' సినిమాకు సంబంధించిన విషయాల్లో బిజీగా గడుపుతున్నాడు. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం జూన్ 20న విడుదల కానుంది.

  సైఫ్ అలీ ఖాన్

  సైఫ్ అలీ ఖాన్


  సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ టాప్ 3 ఖాన్ల సరసన చేరక పోయినా....తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  టాలెంట్

  టాలెంట్


  తనదైన టాలెంటుతో తన సినిమాలపై క్రేజ్ పెరిగేలా చేసుకున్న సైఫ్....అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు, 2010లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నాడు.

  సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్

  సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్


  సైఫ్ అలీ ఖాన్ తన సహచర నటి కరీనా కపూర్‌ను 2012 అక్టోబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఐదేళ్లు ఆమెతో సహజీవనం చేసాడు.

  బ్యాగ్రౌండ్

  బ్యాగ్రౌండ్

  మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ కుమారుడు సైఫ్ అలీ ఖాన్. యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన పరంపర చిత్రం ద్వారా సైఫ్ అలీ ఖాన్ సినిమా రంగ ప్రవేశం చేసారు.

  పేరు తెచ్చిన సినిమా

  పేరు తెచ్చిన సినిమా


  బాలీవుడ్లో వచ్చిన దిల్ చాహతాహై, కల్ హో న హో, సలామ్ నమస్తే, రేస్, పరిణీత, కాక్ టెయిల్ చిత్రాలు సైఫ్ అలీ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

  English summary
  Bollywood's nawab actor Saif Ali khan is back in news for wrong reasons. Past two years of allegedly having assaulted an NRI Businessman and his father-in-law at a hotel in Mumbai, a local court has now framed charges against the star and his two friends under sections of IPC.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more