న్యూడ్ లేడీ పూనమ్ పాండేకు... కోర్టు సమన్లు
బెంగుళూరుకు చెందిన లాయర్ ఎస్ ఉమేష్ పూనమ్ పాండేకు వ్యతిరేకంగా మే 22, 2012న 6వ మెట్రో పాలిటన్ చీఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేట్ కంప్లైంట్ దాఖలు చేసారు. ఆమె నగ్నంగా ఫోజులు ఇస్తూ రిలీజియస్ సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని తన కంప్లంట్ లో పేర్కొన్నారు.
ఈ మేరకు కేసు విచారణకు స్వీకరించిన మెజిస్ట్రేట్ పూనమ్ పాండేకు సమన్లు జారీ చేసారు. కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కేసు విచారణ ఫిబ్రవరి 22, 2013కి వాయిదా వేసారు. ఫిర్యాదు దారు తన ఫిర్యాదులో గతంలో పూనమ్ పాండే టీండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు.
టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని పూనమ్ పాండే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రిలీజియస్ సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నావంటూ పూనమ్ పాండేకు గతంలోనే నోటీసులు పంపినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని తన పిటీషన్లో ఫిర్యాదు దారు ఆరోపించారు.


Click it and Unblock the Notifications












