నటి రంభ తల్లిపై అరెస్టు వారెంటు
పెళ్ళికి సిద్దపడుతున్న నటి రంభ చేదు వార్త వినాల్సి వచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆమె తల్లి ఉషారాణిపై మధురై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. మధురైలోని ఓ చలన చిత్ర పంపిణి సంస్ధ మేనేజర్ శంకరన్ నుంచి ఉషారాణి 2004 అక్టోబర్ 10 న ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నారు. 2005 పిబ్రవరి 17న ఆమె అంతే మొత్తానికి చెక్ ఇచ్చారు. ఆమె ఖాతాలో డబ్బు లేకపోవటంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో ఉషారాణిపై శంకరన్ కేస్ పెట్టారు. నాలుగో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఆమె గైర్హాజరయ్యారు. ఉషారాణిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని చెన్నై విరుంగంబాక్కం ఎస్ ఐకి మెజిస్ట్రేట్ జయకుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. విచారణను మే 28కి వాయిదా వేసారు.
రంభ మధురై చెక్ భౌన్స్ కేసు ఉషారాణి విరుంగంబాక్కం శంకరన్ rambha madhurai marriage tirupati arrest warrent sankaran court


Click it and Unblock the Notifications