ప్రముఖ నిర్మాతకు షాకిచ్చిన కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ
జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చెక్‌బౌన్స్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఈ వారెంట్ జరీ చేసింది.

50 లక్షల చెక్‌బౌన్స్ కేసులో
వివరాల్లోకి వెళితే.. రూ. 50 లక్షల లావాదేవీలకు సంబంధించిన చెక్కు బౌన్స్ కేసులో రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఓ ఫిలిం ఫైనాన్షియర్ దాఖలు చేసిన కేసులో నిర్మాతకు ఈ షాక్ తగిలింది.

కోర్టు ధిక్కరణ కేసుగా
కేసు విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసినప్పటికీ.. రవీంద్రరెడ్డి స్పందించలేదు. కోర్టు ధిక్కార నేరంగా భావించిన కోర్టు.. ఆయనకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాత రవీందర్ తన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

టాలీవుడ్‌లో చర్చనీయాంశం
సాహసం శ్వాసగా సాగిపో, జయ జనకి నాయక లాంటి విజయవంతమైన చిత్రాలు ఇటీవల నిర్మించారు. అలా భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తున్న నిర్మాతగా పేరున్న రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

బిజినెస్ నుంచి సినిమాల్లోకి
మిర్యాల రవీందర్ రెడ్డి ఇటీవలనే సిని నిర్మాణంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఇనుము, ఉక్కు వ్యాపారంలో విశేష అనుభవం గడించారు. ఈ వారెంట్ల నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











