హీరో నందమూరి బాలకృష్ణతో పాటు మరో ఏడుగురిపై అనంతపురం జిల్లా ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. ధర్మవరం పట్టణంలో గత జనవరి 31న నిర్వహించిన రోడ్ షోలో నిబంధనలు ఉల్లంఘించారని అక్కడి పోలీసులు బాలకృష్ణతో పాటు మరో ఏడుగురు తెలుగుదేశం నాయకులపై కేసు నమోదు చేశారు. వారిపై ఛార్జి షీటు దాఖలు చేసినా కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో బాలకృష్ణ, స్థానిక నాయకులు ఓబిరెడ్డి, ఫణి కుమార్, శంకరనారాయణ, సుబ్రహ్మణ్యం, సాకే మద్దిలోటి, కాటమయ్య, కేశవయ్యలపై ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ నాన్-బెయిలబుల్ వారంట్ జారీచేశారని పట్టణ సిఐ రమాకాంత్ తెలిపారు.