twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సత్యానంద' చిత్రంపై స్వామి నిత్యానందకు చుక్కెదురు

    By Srikanya
    |

    బెంగళూరు : 'సత్యానంద' పేరుతో సినీనటుడు, నిర్మాత మదన్‌ పటేల్‌ నిర్మించిన చిత్రం ప్రదర్శనకు అనుమతించకూడదని వివాదాస్పద స్వామీజీ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్‌ను నగర సివిల్‌ కోర్టు కొట్టివేసింది. అయితే, చిత్రం పేరు మార్చాలని, ఈ చిత్రం నిత్యానంద జీవితానికి సంబంధించినది కాదని తెరపై ప్రదర్శించాలని కోర్టు నిర్మాతను ఆదేశించింది.

    'సత్యానంద' చిత్ర ప్రదర్శనపై ఇచ్చిన మధ్యంతర స్టేను తొలగించింది. తన నిజ జీవితంపై వచ్చిన ఆరోపణలను చొప్పించి చిత్రాన్ని నిర్మించారని, చిత్రం వల్ల తన పరువుకు భంగం కలుగుతుందని నిత్యానంద గతంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్వయంగా తిలకించిన న్యాయమూర్తి అభ్యంతకర దృశ్యాలు లేవని అభిప్రాయపడుతూ ఈ మేరకు తీర్పు వెలువరించారు.

    తన జీవితం ఆధారంగా తీసిన సత్యానంద సినిమాలో తన ప్రతిష్ట దెబ్బతినేలా సీన్లు ఉన్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నిత్యానంద తన పిటీషన్లో పేర్కొన్న విషయం తెలిసిందే. దర్శకుడు మదన్‌పటేల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో దొంగ బాబాలు ప్రజల్ని మోసం చేస్తున్నారు.ఈ సినిమాలో అలాంటి బాబాల గురించి సందేశాన్ని అందిస్తు న్నామన్నారు. నిర్మాత జ్యోతిప్రసాద్‌ మాట్లాడుతూ ఈ సినిమా చూసాకయినా దొంగ స్వామీజీలను నమ్మడం మానేస్తారని ...టాలెంట్‌ ఉన్న నటీనటులు దొరకడం ఈ చిత్రానికి అదృష్టమన్నారు. హాస్యన టుడు ఆలీ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను ఒంగోబెట్టి తన్నే దొంగ స్వామిగా నటిస్తున్నానన్నారు.

    'స్వామి సత్యానంద' చిత్రానికి మదన్ పటేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలీ, రవి చేతన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, గుండు హనుమంత రావు, గౌతం రాజు, చిత్రం శ్రీను, బొంబాయి నటి నేహ, ఇటలీ అందాల భామ అలోకి, జయలలిత, కవిత, శ్రద్ధ, విజయ వర్మ, జెమిని ఫణి, జెన్నీ, తిలక్ తదితరులు నటిస్తున్నారు.

    మాటలు-సాయి కృష్ణ; పాటలు-జి.వి.హెచ్.ప్రసాద్, భారతి బాబు. ఫోటోగ్రఫి-సుభాష్; ఎడిటింగ్-రాంబాబు; ఆర్ట్-నారాయణ; స్టిల్స్ - రంగా; కొరేయోగ్రఫి-మురళి, మదన్, హరిణి; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్-నాగి రెడ్డి; నిర్మాతలు-జి.వి.హెచ్.ప్రసాద్, శ్రీమతి లక్ష్మి; సంగీతం, దర్శకత్వం-మదన్ పటేల్.

    English summary
    
 The controversy leading to 'Sathyananda' Kannada and Telugu film by Madan Patel came up before the city civil court on Friday in Bangalore. The city civil court has instructed for change in the title and omission of a few scenes in 'Satyananda' film. The order has come up after hearing the complaint filed by Sri Nithyananda Swamy advocates. On the advice of High Court of Karnataka the city civil court viewed the film and passed order suggesting title change and omission of a few scenes that has direct remark on Swami Nithyananda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X