twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డర్టీపిక్చర్ పై చిర్రెత్తుతున్న మహిళా సంఘాలు, న్యాయవాదులు, మహిళలు..!

    By Sindhu
    |

    డర్టీపిక్చర్ చూసాక ఇదేం సినిమా అండీ బాబూ అని పలు సామాజిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని సంఘాలు డర్టీపిక్చర్ వాల్ పోస్టర్లు చించేస్తున్నారు. పోస్టర్లు చూసిన కుర్రకారు రోడ్లను ట్రాఫిక్ పట్టించుకోకుండా దాటేస్తున్నారు. దానివలన పలు ప్రమాదాలు జరుగుతాయని వాల్ పోస్టర్లు చింపేస్తున్నారు. ఇక చిత్రంకూడా ఎక్కువ అశ్లీలం పైనే ఆధారపడి తీయబడిందని దీన్ని ఎలా సెన్సార్ ఒప్పుకుందని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

    స్మిత జీవితం తీస్తున్నామని మీడియాలో చెప్పారు. దీనిపై స్మిత సోదరుడు నాగవరప్రసాద్ కోర్టుకెక్కడంతో ఏదోలా తప్పించుకుందామని చివరాఖరిలో వేరే పుంతల్లో కథనం నడిపినట్టు కూడా వినిపిస్తోంది. విద్యాబాలన్ వంటి నటి ఈ చిత్రంలో స్మిత వేషం వేసింది ఎందుకు అంటే అంగాంగ ప్రదర్శనకే అన్నట్టుగా సాగిందని సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాన్ చేయాల్సిందిగా ఇప్పటికే వివిధ పట్టణాల్లో సంఘాలు నిర్వహించాయి.

    కాగా ఈ చిత్రంలో హీరోయిన్ వేసిన వేషం సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసింది. మహిళలను కించపరిచేలా చేస్తోందని తక్షణం ఆపించాలిన న్యాయవాదులు నాంపల్లి కోర్టులో కేసు వేసారు. దీనిపై స్పందించిన కోర్టు ఆ చిత్రంలో నటించిన విద్యాబాలన్ పై కేసు నమోదు చేయాల్సిందిగా నల్లకుంట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యాబాలన్ తో పాటు నిర్మాత ఏక్తాకపూర్, దర్శకుడు మిలన్ లుథాచియాపై కూడా కేసు ఫైలు చేయాల్పిందేనని ఆదేశించింది.

    ఐపిసి ది ఇన్ డీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమన్ యాక్టు కింద పోలీసులు ఈ నెల(డిసెంబర్) 31లోగా కేసు పెట్టి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదులు సాయికృష్ణ, అజాద్, శ్రీనివాస్ లు చేసి ఫిర్యాదు మేరకు న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఉత్తరాదిలో కూడా ఇదే తీరులో డర్టీపిక్చర్ పై పలు సంఘాలు గుర్రెత్తిపోతున్నాయి...

    English summary
    The police would accordingly file a first information report and take up the case. A Hyderabad court has filed a criminal case against Bollywood actress Vidya Balan for allegedly posing for indecent photographs on the posters and promos of her latest film 'The Dirty Picture'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X