twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండ్ల గణేష్‌కి ఝలక్ ఇచ్చిన కోర్టు.. జైలుకు తరలింపు

    |

    Recommended Video

    'బండ్ల గణేష్'ను కడపకు తీసుకెళ్లిన పోలీసులు

    ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ను నిన్న (బుధవారం) సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో టాలీవుడ్ నిర్మాత పీవీపీ నమోదు చేసిన కేసు విచారణలో భాగంగా బండ్ల గణేష్‌ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఈ కేసు విషయమై స్పందించిన కోర్టు బండ్ల గణేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. వివరాల్లోకి పొతే..

    టెంపర్ సినిమా విషయమై వివాదం

    టెంపర్ సినిమా విషయమై వివాదం

    ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ), బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా విషయంలో వచ్చిన విబేదాల వల్ల పీవీపీకి, బండ్ల గణేష్ మధ్య గొడవ మొదలై అది కాస్త పోలీస్ కేసు వరకూ వెళ్ళింది. దీంతో ఈ ఇద్దరి ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    అర్థరాత్రి వేళ అనుచరులతో బండ్ల గణేష్

    అర్థరాత్రి వేళ అనుచరులతో బండ్ల గణేష్


    కాగా కొద్ది రోజుల క్రిందట బండ్ల గణేష్, అర్థరాత్రి వేళ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కోసమై బండ్ల గణేష్ ఇంటికి, ఆఫీసుకు వెళ్లగా ఆయన కనిపించక పోవడంతో.. బండ్ల గణేష్ పరారీలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు నిన్న ఆయన కనిపించడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    జోక్యం చేసుకున్న కోర్టు ఏమని చెప్పిందంటే..

    జోక్యం చేసుకున్న కోర్టు ఏమని చెప్పిందంటే..

    బండ్ల గణేష్ అరెస్ట్ తర్వాత ఈ కేసులో జోక్యం చేసుకున్న కడప మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తునట్లుగా పేర్కొంది. నవంబర్ 4వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తునట్లుగా మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది.

    గతంలోనూ బండ్ల గణేష్‌.. కేసులు కొత్త కాదు

    గతంలోనూ బండ్ల గణేష్‌.. కేసులు కొత్త కాదు

    బండ్ల గణేష్‌పై ఇలాంటి వివాదాలు, కేసుల కొత్తేమీ కాదు. 'నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో హీరో సచిన్ జోషికి, బండ్ల గణేష్‌కు బేదాభిప్రాయాలు రావడం.. ఒకరినొకరు దూషించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బండ్ల గణేష్ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Buzz Is That Bandla Ganesh Is Arrested. But He Condemns His Arrest News. PVP And bandla Ganesh Issue Again Came Into Light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X