»   »  సల్మాన్ ఖాన్ మెడకు మరో కేసు బిగిసుకుంటోంది

సల్మాన్ ఖాన్ మెడకు మరో కేసు బిగిసుకుంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. ఈ ఘటనకు సంబంధించి సాక్షులను మరోసారి విచారించాలని సల్మాన్‌ఖాన్ పెట్టుకున్న అభ్యర్థనను జోధ్‌పూర్ కోర్టు తోసిపుచ్చింది. సల్మాన్‌ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడటంపై రాజస్థాన్ కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే.

16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. తీర్పు వస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌కు మూడు నుంచి ఏడేళ్లు జైలు శిక్షపడే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1998లో హమ్‌ పాథ్‌ పాథ్‌ హై సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌, సోనాలీ బింద్రే, టబు.. కృష్ణ జింకలను వేటాడారంటూ కేసు నమోదయ్యింది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌ కొంతకాలం జోథ్‌పూర్‌ జైల్లో గడిపాడు.

 Court rejects Salman Khan's plea for witness re-examination

ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సల్మాన్ హై కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా తీర్పును నిలిపి వేస్తూ నెల రోజు పాటు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 15న జరుగనుంది. విచారణ తర్వాత సల్మాన్ ఖాన్ భవితవ్యం తేలనుంది.

దీనికి తోడు జింకల కేసులో కూడా సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే.......పరిస్థితి ఎలా ఉంటుందో? అని అభిమానులు ఆందోలన చెందుతున్నారు. బాలీవుడ్లో టాప్ స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఈ కేసుల వల్ల ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందని టాక్.

English summary
In a setback for Bollywood actor Salman Khan, a Jodhpur court on Thursday rejected his plea for re-examination of witnesses in a case related to illegal possession and use of arms.
Please Wait while comments are loading...