twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పు తీర్చాకే రిలీజు..కోర్టు స్టే

    By Staff
    |

    Bank
    ఈ రోజు(30వ తేదీ)న రిలీజు కానున్న బ్యాంక్ సినిమా విడుదలను ఆపుచేస్తూ విశాఖపట్టణం లోని రెండవ అదనపు జిల్లా కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి ఎ.నవమోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. అబ్బాస్, అర్చన కాంబినేషన్ లో రెడీ అయిన ఈ చిత్రాన్ని బి.అరుణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా తెలుగు,తమిళ,తెలుగు,హిందీ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే నిర్మాత బలిరెడ్డి అరుణ్ కుమార్ విశాఖకు చెందిన కొమ్మరుపు విజయ కాల్దర్ నుంచి ఇరవై లక్షలు రూపాయిలు అప్పుగా తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందు అప్పును వడ్డీతో సహా తీరుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

    సినిమా విడుదలకు ముందు అప్పును వడ్డీతో సహా తీరుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పు సొమ్ము వడ్డీతో సహా పాతిక లక్షలుకు చేరింది. నిబంధనలు ప్రకారం అప్పు తీర్చిన తర్వాత మాత్రమే సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే నిర్మాత అరుణ్,విజయశ్రీ కి అప్పు చెల్లించకుండానే శుక్రవారం సినిమా విడుదలకు సంభందించి అన్ని ఏర్పాట్లు చేసారు. విషయం తెలుసుకున్న విజశ్రీ నిర్మాతను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయశ్రీ తన సొమ్ము ఇవ్వకుండా సినిమమా విడుదల చేయరాదని, దాన్ని నిలుపుదల చేయమని కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X