భూకొనుగోలులో నాగవల్లి నటి అనుష్కకు కోర్టు సమన్లు

By Srinivas

నాగవల్లి చిత్రంలో నటించిన కథానాయిక అనుష్కకు కష్టాలు ప్రారంభమయినట్టున్నాయి. వెంకటేష్, అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న నాగవల్లి విడుదలకు ముందే అనుష్కను వివాదాలు చుట్టుకోవటం చర్చనీయాంశమయింది. భీమిలిలోని ఓ ప్రాంతంలో వైఎస్సాఆర్ స్టేడియం దగ్గర ఉన్న భూమిని 2007లో అనుష్క 3000 గజాలు కొన్నారు. ఆ భూమి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నది. కె.లింగమూర్తి అనే ఎన్ఆర్ఐ ఆ భూమి తనదంటూ భీమిలి కోర్టులో 2008లో పిల్ వేశారు. అయితే సోమవారం అనుష్క కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆమె హాజరు కాకపోవటంతో కోర్టు ఆమెను జనవరి 2011న హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. తప్పుడు పత్రాలు చూపించినట్లు అనుష్క పై కేసు నమోదయింది.

2007లో విక్రమార్కుడు చిత్రీకరణ సమయంలో అనుష్కతో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి, ఎన్ బుల్ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు నలుగురు తలా 3000వేల గజాలు కొన్నారని తెలుస్తోంది. అనుష్క తో పాటు వారికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా కోర్టులో అనుష్క పేరు స్వీటీ శెట్టి అలియాస్ అనుష్కగా పేర్కొన్నారు. లింగముర్తి తన భూమికి చెందిన కాగితాలను ఎక్కడో పొగొట్టుకోవడంతో ఆ పత్రాలు దొరికి వ్యక్తి తప్పుడు పత్రాలతో అమ్మాడు.

కాగా నాగవల్లి చిత్రంలో అనుష్క నటించడం వల్లనే ఆమెను వివాదాలు చట్టుముట్టుతున్నాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు చంద్రముఖిలో నటించిన నటీనటుల చుట్టూ వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. చంద్రముఖికి సీక్వెల్ గా తీస్తున్న నాగవల్లిలో అనుష్క నటించినందుకే ఇలాంటి పరిణామాలంటున్నారు. నాగవల్లిలో నటిస్తే అనుష్కను వివాదాలు చుట్టుముట్టే అవకాశముందని ఇంతకుముందు కొందరు చెప్పిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X