పెళ్లి కోసం అన్యాయంగా! రామ్ చరణ్ మామకు కోర్టు నోటీసులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మామ, ఉపాసన తండ్రి అనిల్ కామినేనికి కామారెడ్డి కోర్టు నోటీసులు జారీ చేసింది. చరణ్-ఉపాసన పెళ్లి తంతులో భాగంగా ఉపాసన పూర్వీకులకు సంబంధించిన దోమకొండ కోటలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం కోట చుట్టుపక్కల నివాసం ఉంటున్న కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారట.
కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా తమను అన్యాయంగా నిర్వాసితులను చేశారని ఆరోపిస్తూ సదరు కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు అనిల్ కామినేని, ఉమాపతిరావులకు నోటీసులు జారీ చేస్తూ జులై 12న విచారణ కోసం హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గొప్పోళ్లు తమ సౌకర్యం కోసం పేదోళ్లను తరిమేయడం చాలా సందర్భాల్లో చూశాం కానీ....రామ్ చరణ్ పెళ్లికి తాము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని తాము ఎప్పుడూ ఊహించలేదని, నటుడిగా చరణ్‌ను ఎంతో అభిమానించామని, కానీ ఆయన వివాహం తమ కొంపలకు ఎరసరు పెట్టిందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో చరణ్ ప్రమేయం లేకున్నా చరణ్ పెళ్లికి ఇలా జరుగడాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు.
రామ్ చరణ్-ఉపాసన వివాహం జూన్ 14న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంత రామ్ చరణ్ తన సినిమా షూటింగుల్లో బిజీ అయిపోయాడు. మరి ప్రజా సేవలో ఉన్న చిరంజీవి ఈ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటారో? చూడాలి.


Click it and Unblock the Notifications











